Naga Chaitanya : అలాంటి ఫీలింగ్స్ తట్టుకోలేకనే నాకు సమంత విడాకులు ఇచ్చింది అంటూ నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్!

- Advertisement -

Naga Chaitanya : ఆన్ స్క్రీన్ మీద బ్లాక్ బస్టర్ గా నిల్చిన సమంత మరియు నాగ చైతన్య జంట, నిజ జీవితం లో కూడా ప్రేమించి, పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. మేడ్ ఫర్ ఈచ్ అథర్ లాగా అనిపించే ఈ జంట నాలుగేళ్లకే విడిపోవడం అనేది అందరికీ పెద్ద షాక్. ఇప్పటికీ ఈ షాక్ నుండి అభిమానులు మరియు ప్రేక్షకులు కోలుకోలేదు.

Naga Chaitanya
Naga Chaitanya

సమంత మరియు నాగ చైతన్య మళ్ళీ కలిసిపోతే బాగుండును అని కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు. కానీ అది జరిగే పని కాదని అర్థం అయిపోయింది. పెళ్ళైన తర్వాత వీళ్లిద్దరు స్నేహం గా ఉంటామని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. నాగ చైతన్య సమంత తో స్నేహం గా ఉండడానికి ఇప్పటికీ కూడా సిద్దమే. ఆమె గురించి పలు ఇంటర్వ్యూస్ లో ఎంతో గొప్పగా మాట్లాడాడు కూడా. కానీ సమంత కి మాత్రం నాగ చైతన్య తో స్నేహం గా ఉండడం ఇష్టం లేదు.

Samantha  Naga Chaitanya

ఆమె మనసులో ఏమి లేకపోతే నాగ చైతన్య తో స్నేహం గా ఉండొచ్చు, కానీ ఆమెని నాగ చైతన్య ని ఇంకా మర్చిపోలేకపోతుంది కాబట్టే స్నేహం చెయ్యడానికి ఇష్టపడడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి వినిపిస్తున్న మాట. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో సమంత గురించి నాగ చైతన్య పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు.

- Advertisement -
CHaysam

ఆయన మాట్లాడుతూ ‘సమంత చాలా ఎమోషనల్ మనిషి. ప్రతీ విషయం లోను ఆమె ఫీలింగ్స్ చాలా ఎక్కువే, ఎప్పుడైనా ఏదైనా విషయం లో హర్ట్ అయితే ఆమె రాత్రులు నిద్ర కూడా పోయేది కాదు, దాని గురించే ఆలోచిస్తూ ఉండేది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆమె ఇంత ఎమోషనల్ కాబట్టే నాగ చైతన్య తో సంసారం కొనసాగించలేకపోయింది. అందుకే విడాకులు తీసుకుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here