అక్కినేని హీరో నాగ చైతన్య గురించి చెప్పనక్కర్లేదు.. నాగార్జున తనయుడుగా ఇండస్ట్రీకి పరిచయమైనా కూడా తన టాలెంట్ తో మంచి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈయన హీరోయిన్ సమంతాను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. ఏడు, ఎనిమిది సంవత్సరాలు ప్రేమించుకున్న ఈ జంట పెళ్లయ్యాక కనీసం నాలుగు సంవత్సరాలు కూడా కలిసి ఉండలేకపోయారు.దాంతో రోజు ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో గొడవలు పెట్టుకుని కలిసి ఉండే కంటే విడిపోవడమే బెటర్ అని భావించిన ఈ జంట గత రెండేళ్ల క్రితం విడాకులు తీసుకోబోతున్నాం అంటూ చెప్పుకొచ్చారు.. ఈ వార్త ఇప్పటికి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గానే మిలిగిపోయింది.. ఇప్పుడు మరో వార్త చక్కర్లు కొడుతుంది.. ఈ కుర్రాడు ఇంటర్లోనే అలాంటి పనులు చేశాడంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది..
అయితే తాజాగా కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య తన ఫస్ట్ లవ్. ఫస్ట్ కిస్.. గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య మాట్లాడుతూ.నేను ఆన్ స్క్రీన్ లో మొదటిసారి కిస్ పెట్టింది మాత్రం ఏ మాయ చేసావే సినిమా టైంలో సమంతకి అని చెప్పాడు..ఇక ఆఫ్ స్క్రీన్ లో కిస్ ఎప్పుడు పెట్టాను అనేది మాత్రం నేను ఇప్పుడు చెప్పాలనుకోవడం లేదు.నేను ఏడో తరగతిలో ఉన్నప్పుడు నా క్లాసులో ఉన్న ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. అలాగే ఇంటర్ లో ఒక అమ్మాయితో కాఫీకి డేట్ కి వెళ్ళాను.. అంటూ నాగ చైతన్య అన్నాడు.. ఆ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. అలాగే నేను ఒక అమ్మాయిని ఇష్టపడేటప్పుడు ఆమెలో ఉన్న వ్యక్తిత్వాన్ని చూసే ఇష్టపడతాను. అలాగే అప్పుడప్పుడు నేను ఒంటరిగా ఉంటాను..
ఆ సమయంలో నాకు కొత్త కొత్త అలోచనలు వస్తాయని అంటున్నాడు.. అవి నాకు జీవితంలో మరింత బ్యాలెన్స్ గా ఉండడానికి ఉపయోగపడతాయి అంటూ నాగచైతన్య తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రస్తుతం నాగచైతన్య తన ఆన్ స్క్రీన్ ఫస్ట్ కిస్ సమంత తోనే అని చెప్పడం మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక సమంత మాత్రం అసలు నాగచైతన్య గురించి మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. కానీ నాగచైతన్య మాత్రం సమంత గురించి ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నాడు.. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండ్ అవుతుంది.. దీంతో ఈ వీడియో ను చూసిన వారంతా నాగచైతన్య ఇంత ముదురా.. ఇంటర్ లోనే అన్నీ కానిచ్చాడా.. మంచి రసికుడే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఇక వీరిద్దరూ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు..