Naga Chaitanya : అక్కినేని నాగార్జున నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నాగ చైతన్య తనకంటూ ఆడియన్స్ లో ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన కెరీర్ ఏడాది కి రెండు హిట్లు, మూడు ఫ్లాపులు అన్నట్టుగా సాగిపోతుంది. సమంత ని ప్రేమించి పెళ్లి చేసుకొని, నాలుగేళ్ల తర్వాత విడిపోయిన నాగ చైతన్య గత కొంత కాలం నుండి శోభిత దూళిపాళ్ల తో రిలేషన్ లో ఉన్నాడని, ప్రస్తుతం వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.

వీళ్లిద్దరు కలిసి టూర్స్ కి వెళ్లడం, ప్రైవేట్ పార్టీలకు వెళ్లడం వంటివి సోషల్ మీడియా లో చూసి అభిమానులు కూడా వీళ్లిద్దరు రిలేషన్ లో ఉన్నారు అనే విషయాన్నీ అర్థం చేసుకున్నారు. పెళ్లి ఎప్పుడూ అని సోషల్ మీడియా లో నాగ చైతన్య ని అడుగుతూ ఉన్నారు ఫ్యాన్స్.

ఇకపోతే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో నాగచైతన్య ని యాంకర్ ‘మీరు శోభిత తో చాలా కాలం నుండి డేటింగ్ లో ఉన్నారు కదా’ అని అడగగా, దానికి నాగ చైతన్య సమాధానం చెప్తూ ‘రాసేవాళ్ళని మనం ఆపలేము, రాసుకోమని చెప్పండి ఎన్నైనా,నేను ఆ అమ్మాయితోనే ఉన్నాను అని అనుకోండి, ఎం అవ్వుద్ది ఇప్పుడు?, మీ ఇష్టమొచ్చినట్టు రాయండి, నేనైతే నా వ్యక్తిగత జీవితం లో ఎంతో సంతోషం గా ఉన్నాను’ అని చెప్పుకొచ్చాడు.

ఆయన హీరో గా నటించిన ‘దూత’ అనే వెబ్ సిరీస్ డిసెంబర్ 1 వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో స్ట్రామింగ్ అయ్యేందుకు సిద్ధం గా ఉంది. ఈ సిరీస్ నటుడిగా నాగచైతన్య ని మరో లెవెల్ కి తీసుకెళ్తుంది అట. అలాగే గీత ఆర్ట్స్ బ్యానర్ లో ‘తండేల్’ అనే భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాకి చందు మొలేటి దర్శకత్వం వహిస్తున్నాడు.