Naga Babu : వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం కి ముహూర్తం సిద్ధం.. వైరల్ అవుతున్న నాగబాబు కామెంట్స్

- Advertisement -

Naga Babu : టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరిగా ఉన్న హీరో వరుణ్ తేజ్.. ఆయనతో కలిసి తిరుగుతున్న ఎంతోమంది హీరోలు ఈమధ్యనే ఒకరి తర్వాత ఒకరు పెళ్లిళ్లు చేసుకుంటూ తమ బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్తున్నారు.రీసెంట్ గా శర్వానంద్ కూడా నిశ్చితార్థం చేసుకున్నాడు, ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ లో మిగిలి ఉన్నది వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ మరియు ప్రభాస్ మాత్రమే.రీసెంట్ గానే నాగబాబు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో త్వరలోనే వరుణ్ తేజ్ పెళ్లి చేయబోతున్నాను అంటూ ప్రకటించాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అయితే చాలా కాలం నుండి వరుణ్ తేజ్ ప్రముఖ హీరోయిన్ ;లావణ్య త్రిపాఠి తో ప్రేమలో ఉన్నాడని,వీళ్లిద్దరు ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. దీనిపై అటు వరుణ్ తేజ్ కానీ, ఇటు లావణ్య త్రిపాఠి కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

Naga Babu
Naga Babu

దానికి తోడు వీళ్లిద్దరు కలిసి ప్రైవేట్ పార్టీలకు వెళ్లడం, మెగా ఫ్యామిలీ కుటుంబానికి సంబంధించి ఏ చిన్న ఫంక్షన్ కి అయినా లావణ్య త్రిపాఠి హాజరు కావడం వంటివి వీళ్ళ మధ్య ఎదో నడుస్తుంది అనే రూమర్ కి బలం చేకూర్చింది. ఇక రీసెంట్ ఆమె చేసిన ఓటీటీ మూవీ ‘పులిమేక’ విడుదల అవ్వబోతుండడం తో ప్రొమోషన్స్ లో బాగా పాల్గొంది. అందులో భాగంగానే ప్రతీ శనివారం ఈటీవీ లో ప్రసారమయ్యే సుమ ‘అడ్డా’ కార్యక్రమం లో పాల్గొన్నది లావణ్య త్రిపాఠి. ఇందులో రాపిడ్ ఫైర్ ప్రశ్నలు అడిగే రౌండ్ లో ‘నాని మరియు వరుణ్ తేజ్ లో హ్యాండ్సమ్ ఎవరు?’ అని అడగగా లావణ్య త్రిపాఠి క్షణం కూడా ఆలోచించకుండా వరుణ్ తేజ్ పేరు చెప్తుంది. ఆమె ఇద్దరి హీరోలతో కలిసి సినిమాలు చేసింది, అయినా కానీ వరుణ్ తేజ్ పేరు చెప్పడం పై వీళ్లిద్దరి మధ్య ఉన్న రూమర్ కి మరింత బలం చేకూర్చింది.

రీసెంట్ గా బాలీవుడ్ లో కూడా ఇలాగే సీక్రెట్ రిలేషన్ ని మ్యానేజ్ చేసి కియారా అద్వానీ మరియు సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లి కబురు చెప్పి అందరిని షాక్ కి గురయ్యేలా చేసారు.. ఇప్పుడు వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి కూడా అలాగే షాక్ ఇవ్వబోతున్నారా అని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ రూమర్స్ లో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే మరో రెండు నెలలు వేచి చూడాల్సిందే. ఎందుకంటే నాగబాబు వరుణ్ తేజ్ పెళ్లిని రాబొయ్యే రెండు మూడు నెలల్లోనే చెయ్యాలని అనుకుంటున్నాడు అట. వీళిద్దరికి ఇప్పటికే నిశ్చితార్థం తేదీ కూడా ఫిక్స్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here