Nag Ashwin ‘కల్కి’ డైరెక్టర్ నాగ అశ్విన్ తో మిస్ అయిన పవన్ కళ్యాణ్ చిత్రం అదేనా?

- Advertisement -
Nag Ashwin కల్కి చిత్రం తో డైరెక్టర్ నాగ అశ్విన్ పేరు దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో మారుమోగిపోతుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఈ చిత్రానికి ముందు ఆయన కీర్తి సురేష్ తో సావిత్రి గారి బయోపిక్ ‘మహానటి’ తీశారు. ఈ చిత్రం కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా, కీర్తి సురేష్ కి ఉత్తమ నటి క్యాటగిరీ లో నేషనల్ అవార్డుని కూడా తెచ్చిపెట్టింది. అలా 24 క్రాఫ్ట్స్ లో ఆ చిత్రాన్ని కల్ట్ క్లాసిక్ గా తీర్చి దిద్దాడు నాగ అశ్విన్. అశ్విని దత్ అల్లుడు కాబట్టి నాగ అశ్విన్ కి టాలీవుడ్ లో ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ తో అయినా సినిమా చేసే అవకాశం దొరుకుతుంది. అలా ఆయన రెండవ సినిమాతోనే ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ సూపర్ స్టార్ తో చేసే అవకాశం కొట్టేసాడు.
Nag Ashwin
Nag Ashwin

ప్రభాస్ తో సినిమా అంటే మాటలు కాదు, ఏమాత్రం తేడా వచ్చినా అభిమానులు రక్కేస్తారు. ఆ భయం మేకింగ్ లో ఏమాత్రం చూపకుండా ఎంతో అద్భుతంగా ‘కల్కి’ చిత్రాన్ని తీసి బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టి చరిత్ర సృష్టించాడు. అయితే నాగ అశ్విన్ గురించి ఎవరికీ తెలియని మరో నిజం ఏమిటంటే, ఆయన మొదటి సినిమాని రామ్ చరణ్ తో చేయించాలని అనుకున్నాడట అశ్వినీ దత్. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చెయ్యాలని ప్రయత్నాలు చేశారట. అశ్వినీదత్ రిక్వెస్ట్ మేరకు పవన్ కళ్యాణ్ అప్పట్లో నాగ అశ్విన్ చెప్పిన స్టోరీ ని కూడా విన్నాడట.

Nag Ashwin reacts to the criticism about Kalki 2898 AD's first half | Latest Telugu cinema news | Movie reviews | OTT Updates, OTT

ఆయనకి చాలా బాగా నచ్చింది , కచ్చితంగా సినిమా చేద్దాం, కాకపోతే ముందు నేను కొన్ని చిత్రాలు కమిట్ అయ్యి ఉన్నాను, అవి పూర్తి చేసుకున్నాక కబురు పంపుతాను అని చెప్పాడట. కానీ మధ్యలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వడం, ఆ తర్వాత పరిణామాలు మొత్తం మారిపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు పట్టాలు ఎక్కలేకపోయింది. మరి భవిష్యత్తులో అయినా ఈ ప్రాజెక్ట్ ఉంటుందో లేదో చూడాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పని చేస్తున్నాడు, ఆయన చేతిలో 5 మంత్రిత్వ శాఖలు కూడా ఉన్నాయి, అలాగే పూర్తి చెయ్యాల్సిన సినిమాలు కూడా మూడు ఉన్నాయి, ఇలాంటి పరిస్థితిలో వీళ్లిద్దరి ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్తుందా లేదా అనేది చూడాలి.

- Advertisement -

Nag Ashwin: ప్రియాంకను పెళ్లి చేసుకోక పోతే కల్కి వచ్చేది కాదా? - NTV Telugu

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here