SS Thaman బీజీఎమ్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇక ఏ హీరోకు ఎలా ఉన్నా కూడా నందమూరి బాలకృష్ణ సినిమాకు థమన్ ఇచ్చే మ్యూజిక్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఒక అఖండ, ఒక వీరసింహారెడ్డి.. ఇప్పుడు భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్. హైదరాబాద్ లో గ్రాండ్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు.

ఈ ప్రెస్ మీట్ లో థమన్.. బాలకృష్ణ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. “కొన్ని సినిమాలు అద్భుతమైన మ్యూజిక్ తో ఆడుతాయి. గొప్ప ఎనర్జీ ఇస్తాయి. భగవంత్ కేసరి కూడా అలాంటి సినిమానే. సినిమా అంతా అద్భుతంగా వుంది. దర్శకుడు అనిల్ తన వెన్నెముక నాకు కూడా అతికించారు. నిర్మాతలు చాలా కూల్ గా వుంటారు. అనిల్ అద్భుతంగా పిక్చరైజ్ చేశాడు. తను మంచి లైఫ్ ఉన్న ఫిల్మ్ ఇచ్చాడు. ఇందులో పని చేసిన అందరూ దానికి ఆక్సిజన్ నింపారు. అందుకే ఈ సినిమా ఈ రోజు ఇంత అద్భుతంగా వచ్చింది. యూనిట్ అంతా ఇంత ఆనందంగా ఉంది.

శ్రీలీల కంప్లీట్ యాక్టర్ అద్భుతంగా నటించింది. తనకి ఈ సినిమా మరింత పేరు తీసుకొస్తుంది. నా మొదటి జీతం బాలకృష్ణ గారి సినిమా ( భైరవద్వీపం) నుంచే తీసుకున్నాను. నా తొమ్మిదేళ్ళ వయసులో ఆయన సినిమాకి పని చేశాను. నాకు కడుపు నింపిన మనిషిగా బాలకృష్ణ గారితో ఎంతో అనుబంధం వుంది. అఖండ, వీరసింహరెడ్డి.. తర్వాత ఈ సినిమా మా ఇద్దరికి హ్యాట్రిక్. ఇది ఫిక్స్. భగవంత్ కేసరి కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడుకున్న బ్యూటీఫుల్ ఎమోషనల్ డ్రామా. కంప్లీట్ ఫిల్మ్. అందరినీ ఈ సినిమా అలరిస్తుంది” అని చెప్పుకొచ్చాడు.