Mrunal Thakur : టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే గోల్డెన్ లెగ్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్స్ చాలా తక్కువ మంది. అలాంటి వారిలో మృణాల్ ఠాకూర్ ఒకరు. దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం సినిమాతో ఈ క్యూటీ టాలీవుడ్‌కి పరిచయమైంది. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ప్రిన్సెస్ నూర్జహా, సీతా మహాలక్ష్మిగా సంప్రదాయబద్ధంగా ఆకట్టుకున్న ఈ క్యూటీ తాజాగా నానితో హాయ్ నాన్న సినిమాతో మరో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తోంది.
వరుస సినిమాల్లో నటించాలనే ఆసక్తి కంటే మంచి పాత్రలున్న సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. సినీ పరిశ్రమలో ఎక్కువ కాలం కొనసాగాలంటే గ్లామర్‌ను కాపాడుకోవాలని వివరించింది. గ్లామర్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటానని వివరించింది. ముఖానికి పసుపు రాసుకోవడం, ఫ్రెష్ ఫ్రూట్స్ తో ఫేస్ ప్యాక్ చేసుకోవడం, రైస్ వాటర్ ను ముఖంపై స్ప్రే చేయడం వంటి నేచురల్ బ్యూటీ టిప్స్ చేస్తాను అని మృణాల్ తెలిపారు.
2023లో కేన్స్‌లో సందడి చేయడంతో నా కల నెరవేరిందని వివరించింది. నటిగా ఆఫర్లు రావడం చాలా కష్టమని మృణాల్ ఠాగూర్ వివరించారు. ఎన్ని సమస్యలు ఎదురైనా సంతోషంగా ఉండాలనే తత్వంతో ఈ వేదికపై ఉన్నానని.. ప్రేక్షకులకు నా పేరు గుర్తు లేకపోయినా నేను చేసిన పాత్రలు వారి మదిలో మెదులుతాయని వివరించింది. రోజు పనికి వెళ్లాలని నేను ఇష్టపడే పనిని చేయాలని భావిస్తానంటూ చెప్పుకొచ్చింది. లుక్స్ కు, ఈవెంట్ కు అనుగుణంగా కొత్త ట్రెండ్స్ ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉంటానని, ట్రై చేస్తూ ఉంటానని మృణాల్ వివరించింది.