Mrunal Thakur : ఆ పని చేసి పిల్లల్ని కనాలని ఉంది.. కోరిక బయటపెట్టిన మృణాల్

- Advertisement -

Mrunal Thakur : ఒక్క సినిమా మృణాల్ ఠాకూర్ ను స్టార్ హీరోయిన్ రేంజ్ కు చేర్చింది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చిన మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో మృణాల్ సీతామహాలక్ష్మీ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. తొలి సినిమాతో మెప్పించిన మృణాల్ కు తెలుగులో వరుసగా ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఇటీవలే నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాతో మరో హిట్ అందుకుంది.

Mrunal Thakur
Mrunal Thakur

 

హయ్ నాన్న సినిమాలో కూడా మృణాల్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమాలో మృణాల్ హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. రిలేషన్ షిప్ గురించి మాట్లాడుతూ.. సినిమాలో నా రోల్ ను నేను ప్రేమిస్తా.. నా వర్క్‌ను గుర్తిస్తే నేను పడ్డ కష్టమంతా మర్చిపోతాను అని తెలిపింది. ఒకవేళ ఏదైనా నెగిటివ్ వస్తే నా తప్పు ఏమైనా ఉందా.? అని ఆలోచిస్తా..

- Advertisement -

ఇక రియల్ లైఫ్ ప్రేమ గురించి చెప్పాలంటే.. ఒకసారి ప్రేమలో పడిన తర్వాత.. ఆ ప్రేమను మరింత పెంచేందుకు ప్రయత్నించాలి. ఇంకా మిగిలిన వాటి గురించి ఆలోచించకూడదు అని తెలిపింది. నమ్మకం, అనుబంధం అనేవి రెండు వైపులా ఉండాలి. అప్పుడే ఆ రిలేషన్ షిప్ వర్కౌట్ అవుతుంది. నేను ఏ రిలేషన్ షిప్ లోనూ లేను. నాకు ప్రేమలో పడాలని ఉంది. ఇరవై లోనే పెళ్లి చేసుకొని.. పిల్లలను కనాలనిపిస్తుంది. వాళ్ళను తీసుకొని డిన్నర్ కు వెళ్లాలని ఉంది. సెలబ్రెటీ అయితే ఫ్యామిలీని చాలా మిస్ అవుతాం.. ఎక్కడికి ఫ్రీగా వెళ్లలేం.. కనీసం ఒక గుడికి కూడా వెళ్లలేం అని చెప్పుకొచ్చింది మృణాల్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here