మరాఠ సీరియల్స్ నుంచి బాలీవుడ్ కు చేరిన బ్యూటీ మృణాల్ ఠాకూర్. తన టాలెంట్ తో బాలీవుడ్ లో హృతిక్ జోడీగా సూపర్ 30, జాన్ అబ్రహంతో బాట్లా హౌస్, ఫర్హాన్ జంటగా తుఫాన్ సినిమాల్లో నటించి మెప్పించింది బ్యూటీ. ఇక సీతారామం సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన చిన్నది.. తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన మృణాల్.. టాలీవుడ్ లో వరుస అవకాశాలు సాధిస్తోంది. ఎన్ని అవకాశాలు వచ్చినా.. ఆచి తూచి స్పందిస్తోంది బ్యూటీ.

ఎలాగైనా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పాగా వేయాలని పట్టుదలతో ఉంది మృణాల్. అందుకే సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. తెలుగు పరిశ్రమకుదగ్గరవ్వాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది బ్యూటీ.. ప్రస్తుతం నాని 30, సూర్య వీర్ చిత్రాల్లో నటిస్తున్నదీ భామ. సౌత్‌లో ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తుండటంతో.. ఇక్కడేసెటిల్ అవ్వాలని చూస్తోంది చిన్నది. ఈక్రమంలోనే ఆమె హైదరాబాద్ లో సొంత ఇల్లుకూడా కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. సంప్రదాయంగా కనిపించి ఆకట్టుకోవడమే కాదు గ్లామర్ పాత్రల్లో కూడా మెప్పించడం మృణాల్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

హైదరాబాదులో మృణాల్ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి అయితే తాజాగా ఈ వార్తలపై నటి స్పందించి క్లారిటీ ఇచ్చారు.ఈ సందర్భంగా తన గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై స్పందించిన ఈమె అడ్రస్ చెప్తే నా ఇంటికి నేను కూడా వస్తాను అంటూ కామెంట్ చేశారు. ఇలా తన ఇంటి అడ్రస్ చెప్తే తన ఇంటికి చూస్తానంటూ ఈమె ఈ వార్తలపై స్పందించడంతో ఇందులో ఏమాత్రం నిజం లేదని తెలిసిపోతుంది.
హైదరాబాద్ లాంటి ప్లేసులో సెటిల్ అవ్వాలని ఎవరైతే కోరుకోరు అంటూ కూడా ఈమె కామెంట్ చేశారు. అయితే మృణాల్ కామెంట్స్ చూస్తే ప్రస్తుతం అయితే ఈమె హైదరాబాదులో ఇల్లు కొనలేదని కానీ భవిష్యత్తులో కొనే ఆలోచనలో మాత్రం ఉందని స్పష్టం అవుతుంది. త్వరలోనే రూ.50 కోట్లు పెట్టి కొనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.