Mrunal Thakur : తెలుగు అబ్బాయితో పెళ్లి.. అల్లు అరవింద్ అందుకే అన్నారు.. సీక్రెట్ చెప్పేసిన మృణాల్‌ ఠాకూర్‌

- Advertisement -

Mrunal Thakur : ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి మృణాల్‌ ఠాకూర్‌. ఈమె పెళ్లి విషయమై ఓ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ మాట్లాడటం అందరి దృష్టినీ ఆకర్షించింది. సంబంధిత విజువల్స్‌ కొన్ని రోజుల క్రితం నెట్టింట వైరల్‌ అయ్యాయి. ఈ క్రమంలో మృణాల్‌ తెలుగు అబ్బాయిని పెళ్లాడబోతోందంటూ పలు వెబ్‌సైట్లలో ఊహాగానాలు వెలువడ్డాయి. తాజాగా వాటిపై ఆమె సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. అవన్నీ రూమర్స్‌ అంటూ కొట్టిపారేశారు. ఈ మేరకు ఓ వీడియో పోస్ట్‌ చేశారు.

Mrunal Thakur
Mrunal Thakur

‘‘నా స్నేహితులు, స్టైలిస్ట్‌ డిజైనర్స్‌, బంధువులు వరుసగా ఫోన్‌కాల్స్‌ చేసి తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నావా? అని అడుగుతున్నారు. ఆ అబ్బాయి ఎవరో నాకూ తెలుసుకోవాలని ఉంది. ఈ ఫన్నీ రూమర్‌ గురించి ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. త్వరలోనే పెళ్లవుతుంది. అయితే.. వరుడిని మీరే వెతికిపెట్టి నాకు చెప్పండి. కల్యాణ వేదిక, ఆ లోకేషన్‌ వివరాలు కూడా పంపండి. సరేనా?’’ అని వ్యాఖ్యానించారు. అల్లు అరవింద్‌ ఏమన్నారంటే? సైమా 2023 అవార్డుల ప్రదానోత్సవం సెప్టెంబర్‌లో దుబాయ్‌ వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. ‘సీతారామం’ చిత్రానికిగానూ మృణాల్‌ ఉత్తమ నటి (క్రిటిక్స్‌) విభాగంలో అవార్డు అందుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..

allu aravind mrunal thakur

‘‘సీత పాత్రకు నేను సరిపోతానని టీమ్‌ బాగా నమ్మింది. అచ్చ తెలుగింటి అమ్మాయిలా నన్ను తీర్చిదిద్దారు. ఈ సినిమా షూట్‌ మొదలైన నాటి నుంచి హైదరాబాద్‌ని మా ఇంటిలా ఫీలయ్యా. ముంబయికి వెళ్లాలనిపించేది కాదు. ‘మీరు హైదరాబాద్‌ షిఫ్ట్‌ అయ్యారా?’ అని ముంబయి నిర్మాతలు చాలా మంది అడిగేవారు. నాకు మాత్రం హైదరాబాద్‌కు వచ్చేయాలని ఉంది’’ అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆమెకు అవార్డు అందజేసిన అనంతరం అరవింద్‌ మాట్లాడుతూ.. ‘‘గతంలో నేనొక ఈవెంట్‌లో హైదరాబాద్‌ అబ్బాయిని పెళ్లి చేసుకుని తెలుగింటికి కోడలిగా రమ్మని ఓ హీరోయిన్‌ (లావణ్య త్రిపాఠి)కి బ్లెస్సింగ్స్‌ ఇచ్చా. తెలుగు హీరోతో ఆమె ప్రేమలో పడింది. త్వరలో పెళ్లి చేసుకోనుంది. ఇప్పుడు నిన్ను కూడా బ్లెస్‌ చేస్తున్నా. నువ్వు కూడా ఇక్కడికి తిరిగి వచ్చేయాలని కోరుకుంటున్నా’’ అని నవ్వుతూ చెప్పారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com