క్లాసిక్ మూవీస్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్ లో దుల్కర్ సల్మాన్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం సీతారామం. లేటెస్ట్ గా ఈ మూవీ రిలీజై ఏడాది పూర్తైన నేపథ్యంలో హీరోయిన్ మృణాల్ ఎమోషన్ పోస్ట్ చేశారు.ఒక అందమైన సీతారామంలో.. నన్ను సీతగా పరిచయం చేసిన డైరెక్టర్ హనుకు స్పెషల్ థ్యాంక్స్ చెపుతూ.. కెరీర్లో ఫస్ట్ మూవీతోనే తనను తెలుగింటి అమ్మాయిలా ఆదరించినందుకు , అమితమైన ప్రేమను చూపినందుకు తెలుగు ఆడియన్స్ కు ధన్యవాదాలు తెలిపింది మృణాల్.

ఈ ఫీల్‌గుడ్ ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా విడుదలై సరిగ్గా ఏడాది అవుతోంది. ఈ నేపథ్యంలోనే తెలుగు సినీ ప్రియులు, చిత్రబృందానికి కృతజ్ఞతలు చెబుతూ మృణాల్ తాజాగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘‘డియర్ ఆడియన్స్.. నటిగా నా తొలి తెలుగు చిత్రం ‘సీతారామం’. నేను కన్న కలలను మించి మీరు నాపై ప్రేమాభిమానాలు చూపించారు. నన్ను మీ తెలుగింటి అమ్మాయిలా ఆదరించినందుకు, ఈ ప్రయాణంలో అమితమైన ప్రేమాభిమానాన్ని చూపించినందుకు ధన్యవాదాలు. ఇది నాకెంతో ప్రత్యేకం. మరెన్నో ఏళ్ల పాటు విభిన్నమైన పాత్రలతో వినోదాన్ని అందిస్తానని మీకు మాటిస్తున్నా. ’’ అని ఆమె తెలిపారు. అయితే ఈ మాటలు విన్న వారంతా ఆనందం వ్యక్తం చేసినా.. కొందరు మాత్రం వినోదం అంటే బికినీ వేసుకోవడం కాదంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

అలాగే అనంతరం చిత్రబృందాన్ని ఉద్దేశిస్తూ.. ‘‘నా నుంచి సీత బెస్ట్ వెర్షన్‌ను స్క్రీన్‌పైకి తీసుకువచ్చిన దర్శకుడు హను రాఘవపూడికి.. ఈ మొత్తం ప్రయాణాన్ని నాకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసిన దుల్కర్‌తోపాటు చిత్రబృందం మొత్తానికి ధన్యవాదాలు’’ అని ఆమె పోస్ట్ పెట్టారు. ‘సీతారామం’ మేకింగ్ వీడియోను సైతం అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఇది నెటిజన్లను ఆకర్షిస్తోంది. మరోవైపు, చిత్ర నిర్మాణ సంస్థ సైతం స్పెషల్ వీడియోలు షేర్ చేసింది. వైజయంతి మూవీస్, స్వప్నా సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో మంచి వసూళ్లు రాబట్టింది. మృణాల్ ప్రస్తుతం.. ‘హాయ్ నాన్న’తోపాటు విజయ్ దేవరకొండతో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు.