Mrunal Thakur సీతారామం సినిమాలో సీతగా కనిపించిన మృణాల్ ఠాకూర్.. అమ్మాయంటే ఇలా ఉండాలి అని ప్రతి అబ్బాయి ఫీల్ అయ్యేలా చేసింది. ఈ మూవీలో మృణాల్ ను చూసి ఇష్టపడని వారంటూ లేరంటే అతిశయోక్తి కాదు. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంది.

ఇక సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ క్రేజ్ మామూలుగా లేదు. సీతారామం సినిమా తర్వాత నెట్టింట ఈ భామకు ఫాలోయింగ్ పెరిగిపోయింది. పాపులారిటీకి తగ్గట్టు మృణాల్ గ్లామర్ డోస్ కూడా పెంచేస్తోంది. ఓవైపు ట్రెడిషనల్ గా మరోవైపు ట్రెండీగా ఆకట్టుకుంటోంది. అలా రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ వస్తోంది. తాజాగా మృణాల్ అందాల ప్రదర్శన చూసి నెటిజన్లు షాక్ అయ్యారు.

ఇన్నాళ్లూ సంప్రదాయంగా.. కాస్త ట్రెండీగా కనిపించిన మృణాల్.. తానేం తక్కువ కాదంటూ తాజాగా బికినీలో దర్శనమిచ్చింది. బ్లూ కలర్ బికినీలో బీచ్ లో సందడి చేస్తూ ఫొటోలు దిగింది. ఈ ఫొటోలను కాస్త నెట్టింట షేర్ చేసింది. ఇంకేముంది.. నెటిజన్లు తెగ లైకులు, షేర్లు చేస్తున్నారు. ఎట్టకేలకు మృణాల్ కూడా బికినీ టీమ్ లో చేరిపోయిందని కామెంట్లు చేస్తున్నారు. బికినీలో ఈ బ్యూటీ చాలా హాట్ గా కనిపిస్తోందని ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు.

వెకేషన్ లో ఉన్న మృణాల్ తాజాగా ఓ బీచ్ కు వెళ్లింది. అక్కడ బ్లూ కలర్ బికినీలో సందడి చేసింది. మైండ్ బ్లాక్ అయ్యే పోజులిచ్చి కుర్రాళ్లను టెంప్ట్ చేసింది. క్లీవేజ్ షోతో నెట్టింట సెగలు పుట్టించింది. ఇక నడుం చూపిస్తూ.. థైస్ షో చేస్తూ హీట్ పెంచేసింది. ఈ ఫొటోలు చూసిన కుర్రాళ్ల గుండెలు ఝళ్లుమంటున్నాయి. మృణాల్ హాట్ ట్రీట్ చూసి కుర్రాళ్లు ఖుష్ అవుతుంటే.. మరికొందరు నెటిజన్లు మాత్రం సీత ఇలా చేస్తుందని అనుకోలేదని తెగ బాధ పడిపోతున్నారు.

మృణాల్ ఠాకూర్ `సీతారామం` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆమె సీత మహాలక్ష్మి పాత్రలో ఆకట్టుకుంది. తెలుగు ఆడియెన్స్ కే కాదు, అన్ని భాషల్లోనూ మెప్పించింది. వరుసగా ఆఫర్లని అందుకుంటోంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి నానితో కలిసి నటించే ఛాన్స్ దక్కించుకుంది.