Mrunal Thakur : టీవీ సీరియల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ తెలుగులో చేసిన మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ అందుతుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా సీతారామం అనే సినిమా తెరకెక్కింది. ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు ఇతర భాషల ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. ఆమెకు ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ తో తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే నాని హీరోగా హాయ్ నాన్న సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించి మంచి పేరు సంపాదించింది.
ఇప్పుడు ఆమె ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ప్రేక్షకులకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ స్టార్ సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న మృణాల్ సెలబ్రిటీలుగా ఉండటం వల్ల వచ్చే లాభనష్టాలపై స్పందించింది. సెలబ్రిటీగా ఉంటే ఈ ప్రపంచం నిన్ను ప్రేమిస్తుంది, నీ వర్క్‌తో సమాజంలో మార్పు తీసుకురావచ్చని ఆమె చెప్పుకొచ్చింది.
అదే ఇబ్బందుల గురించి చెప్పాలంటే.. వర్క్‌లో భాగంగా కుటుంబానికి దూరంగా వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుందని, అవసరమైనప్పుడు కూడా కుటుంబసభ్యుల పక్కన ఉండలేమని ఆమె కామెంట్ చేసింది. కొన్ని సార్లు తనకు కూడా ఒక సాధారణ జీవితాన్ని గడపాలనిపిస్తుందని గ్రామీణ అమ్మాయిలలాగా 20 యేళ్ళున్నప్పుడే పెళ్లి చేసుకుని, పిల్లలను కని, డిన్నర్ కోసం ఎప్పుడో సరదాగా రెస్టారంట్‌కు వెళ్లి రావాలని ఉంటుందని అన్నారు. అయితే తనకు చావు గురించి ఆలోచిస్తే భయంగా ఉంటుందని.. తను చనిపోతే కుటుంబం ఏమైపోతుందా? అని ఎక్కువగా ఆలోచిస్తుంటానని మృణాల్ ఠాకూర్ కామెంట్ చేసింది.