Vijay Devarakonda – Chiranjeevi : విజయ్ దేవరకొండకు సాయం చేస్తోన్న చిరంజీవి.. రౌడీ హీరోకు మరో సూపర్ హిట్ ఖాయమేనా..!

- Advertisement -

Vijay Devarakonda – Chiranjeevi  : విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్స్ గా నటిస్తున్న కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పరుశురాం డైరెక్ట్ చేస్తున్నారు. గతంలో విజయ్ అండ్ పరుశురాం కాంబినేషన్ లో ‘గీతగోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఈ కాంబినేషన్ పై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఆ అంచనాలను అందుకోవడం కోసం విజయ్ అండ్ పరుశురాం బాగా కష్టపడుతున్నారు. ఈ మూవీ వచ్చే వారం ఏప్రిల్ 5న ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

 

vijay devarakonda chiranjeevi
vijay devarakonda chiranjeevi

ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఏప్రిల్ 2న ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారట. ఇక ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారని సమాచారం. గతంలో గీతగోవిందం సక్సెస్ మీట్ కి చిరంజీవి హాజరయ్యి విజయ్ ని అభినందించారు. ఇప్పుడు మూవీ రిలీజ్ కి ముందే వచ్చి విజయ్ ని అభినందించడం కోసం రాబోతున్నారట. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఎదురు చూడాలి. కాగా ఈ మూవీని ఇప్పుడు తెలుగు అండ్ తమిళంలో రిలీజ్ చేస్తున్నారు.

- Advertisement -

రెండు వారలు తరువాత హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. కాగా ఈ మూవీ థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 45 కోట్ల వరకు జరుగుతున్నట్లు సమాచారం. గీతగోవిందంతో 100 కోట్ల కలెక్షన్స్ ని అందుకోవడంతోనే.. ప్రస్తుతం విజయ్ ప్లాప్స్ లో ఉన్న ఇంతటి బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. మరి విజయ్ అండ్ పరుశురాం తమ పై ఉన్న నమ్మకాన్ని కాపాడుకుంటారేమో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here