Trending News: ప్రస్తుతం సినిమా హాళ్లలో సినిమాలు చూసే వారి సంఖ్య చాలా తగ్గిపోయింది. ఇక మల్టీప్లెక్స్ థియేటర్స్ లో సినిమా చూడాలంటే కనీసంలో కనీసం టికెట్ కు 250 రూపాయలు చెల్లించాల్సిందే. అయితే సినిమా లవర్స్ కి ఆ ఒక్కరోజు కేవలం రూ.99లకే సినిమా చూసే అవకాశం లభిస్తే.. సినిమా లవర్స్‌కు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్ ఇచ్చింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే సినిమా టికెట్లపై మంచి ఆఫర్లు ప్రకటించడం అనేది జరుగుతుందే. తాజాగా మరోసారి టికెట్ రేట్ల పై భారీ డిస్కౌంట్స్ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 31న ‘సినిమా లవర్స్ డే’ ను పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా ఏ భాష సినిమా అయినా.. మల్టీఫ్లెక్స్‌లలో కేవలం రూ.99 టికెట్‌తో సినిమాలను చూడొచ్చని వెల్లడించింది. రిక్లైనర్స్, ప్రీమియం ఫార్మాట్స్ మినహాయించి మిగతా సీట్లకు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పించింది.
దేశవ్యాప్తంగా ఉన్న నాలుగు వేలకంటే వేల ఎక్కువ మల్టీప్లెక్స్ స్క్రీన్స్ లో రూ.99లు చెల్లించి సినిమా చూసే అవకాశం కల్పించారు. పీవీఆర్-ఐనాక్స్, సినీ పోలిస్, మిరాజ్, సిటీ ప్రైడ్, ఏషియన్, ముక్త ఏ2, మూవీ టైం, మూవీ మ్యాక్స్, వేవ్, ఎం2కే, డిలైట్ లాంటి అనేక మల్టీప్లెక్సుల్లో సినిమాలు చూడవచ్చునని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. గత రెండేళ్లుగా వయసుతో సంబంధం లేకుండా సినిమాలకు వచ్చి బాక్సాఫీస్ వద్ద అనేక సినిమాలను హిట్ చేశారు. అందుకు కృతజ్ఞతగా సినిమా లవర్స్ డే నాడు ప్రత్యేకంగా ఈ ఆఫర్ ని తీసుకొస్తున్నట్లు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. కాబట్టి ఏవైనా సినిమాలు మిస్ అయి ఉంటే రూ.99కే సినిమాలను చూసేయచ్చు.
లవ్ మీ ఇఫ్ యూ డేర్, రాజు యాదవ్, గంగం గణేషా, భజే వాయు వేగం లాంటి సినిమాలు లైన్లో ఉన్నాయి. ఈ శుక్రవారం కూడా పలు సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. జాన్వీకపూర్, రాజ్ కుమార్ నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహి ఈ శుక్రవారం విడుదల కాబోతుంది. కాబట్టి మే 31 శుక్రవారం కొత్త సినిమాలను మీరు రూ.99కే చూసే ఛాన్స్ ఉంది. థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్ వెల్లడించింది. బుక్ మై షో, పేటీఎం, అమెజాన్ పే లాంటి ఆన్‌లైన్ ప్లాట్ ఫాంలలో ఈ నెల 31న సినిమా టికెట్లు బుక్ చేసుకొనే వారు రూ.99తో పాటు జీఎస్టీ, కన్వీనియన్స్ ఫీజు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. థియేటర్ కౌంటర్ వద్ద టికెట్ కొనుగోలు చేస్తే.. జీఎస్టీ, ఇతర చార్జీలు ఉండవు.