Shreya Navile : నా సైజ్ చూసి సినిమా వాళ్లు వద్దన్నారు.. పాపం స్టేజిపైనే ఏడ్చిన హీరోయిన్ శ్రేయ నవిలే ..Shreya Navile : కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర జంటగా నటించిన చిత్రం మంత్ ఆఫ్ మధు. ఈ చిత్రానికి శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. త్రిపుర సినిమాలో జంటగా నటించిన వీరిద్దరు మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ రిలీజ్ ఈవెంట్ లో నటి శ్రేయ నవిలే మాట్లాడుతూ ఎమోషనలల్ అయ్యారు. ఆమె సైజ్ కారణంగా అవకాశాలు ఇవ్వలేంటూ ఏడ్చేశారు.

Shreya Navile
Shreya Navile

‘‘నేను చిన్నప్పటి నుంచి లావుగానే ఉన్నాను. ఇదే సైజ్లో ఉన్నా. నాకు భారతీయ సినిమాలంటే చాలా ఇష్టటం. కానీ, ఇక్కడ ఎవ్వరూ నా అంత లావుగా లేరు. నాకు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అన్ని సినిమాలు ఇష్టమే. వాటిల్లో నటించాలని అనుకున్నాను. కానీ, నేను లావుగా ఉన్న కారణంగా నేను సినిమాల్లో కనిపించలేకపోయాను. మంత్ ఆఫ్ మధు చిత్రంలో నన్ను నేను నిరూపించుకోవడానికి మంచి అవకాశం దక్కింది. ఒఖ మనిషికి అవకాశం ఇవ్వడానికి ముందు ఆహె శరీరాన్ని కాకుండా మానవత్వాన్ని చూడాల’’ అంటూ స్టేజ పైనే ఏడ్చేసింది శ్రేయ.

మంత్ ఆఫ్ మధు చిత్రానికి అచు రాజమణి సంగీతం అందించారు. కృషివ్ ప్రొడక్షన్స్, హ్యాండ్‍పిక్డ్ స్టోరీస్ బ్యానర్లు ఈ సినిమాను నిర్మించాయి. మంజుల ఘట్టమనేని, వైవా హర్ష, జ్ఞానేశ్వరి, రాజా చెంబోలు, రాజా రవీంద్ర, రుద్ర రాఘవ్, రుచిత సాధినేని.. మంత్ ఆఫ్ మధు సినిమాలో కీలకపాత్రలు పోషించారు. అక్టోబర్ 6వ ఈ సినిమా రిలీజ్ కానుంది.