Mister Bachan : ‘మిస్టర్ బచ్చన్’ ట్రైలర్ వచ్చేసింది..హరీష్ శంకర్ దెబ్బేసేలా ఉన్నాడే!

- Advertisement -

Mister Bachan: మాస్ మహారాజ రవితేజ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ‘షాక్’ పెద్ద షాక్ ఇచ్చినప్పటికీ, ‘మిరపకాయ్’ చిత్రం మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘాటుని చూపించింది. మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇన్నాళ్లకు ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాకి సంబంధించిన పాటలు, టీజర్స్ ఆడియన్స్ లో ఎంత హైప్ ని పెంచిందో మన కళ్లారా చూసాము.ముఖ్యంగా ఈ చిత్రం లో హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే కి సంబంధించిన హాట్ ఫోటోలు కుర్రోళ్లను పిచ్చెక్కించేలా చేశాయి. అదే సమయం లో ఆ రొమాంటిక్ పోస్టర్స్ వివాదాస్పదం గా కూడా మారాయి.

Mr Bachchan first look: Ravi Teja fans call him 'real fanboy' of Amitabh - Hindustan Times

మొత్తానికి ఎదో ఒక విధంగా ఈ సినిమాకి కావాల్సినంత హైప్ వచ్చేసింది. బిజినెస్ కూడా అద్భుతంగా జరిగింది. అయితే ఈరోజు విడుదల చేసిన ట్రైలర్ ని చూస్తే అభిమానుల్లో కొన్ని సందేహాలు కలిగాయి. ఈ చిత్రం హిందీ లో అజయ్ దేవగన్ హీరో గా నటించిన ‘రైడ్’ అనే చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది. బాలీవుడ్ లో రైడ్ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. సినిమా మొత్తం ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగుతూ హీరో విలన్ మధ్య నువ్వా నేనా అనే తరహాలో స్క్రీన్ ప్లే సాగుతుంది. కానీ తెలుగు లో మాత్రం హరీష్ శంకర్ హీరోయిన్, పాటలు, ఫైట్స్ , కామెడీ అని పెట్టి పూర్తి స్థాయి కమర్షియల్ మూవీ ని చేసాడు. ఈ ట్రైలర్ ని చూస్తే అదే అనిపించింది.

- Advertisement -

Mr Bachchan OTT Rights: Ravi Teja-Starrer Harish Shankar's Upcoming Actioner Closes Digital Streaming Business - Filmibeat

మాతృక సినిమాలో ఉన్నటువంటి ఫీల్ ఈ ‘మిస్టర్ బచ్చన్’ రీమేక్ లో మిస్ అయ్యింది అనే అనుభూతి ట్రైలర్ ని చూస్తే కలిగింది. మరి ట్రైలర్ లో కలిగిన అనుభూతి సినిమా చూస్తున్నప్పుడు కూడా కలుగుతుందా, లేదా వేరేలా ఉంటుందా అనేది చూడాలి. ఎందుకంటే ఈమధ్య కథ కి అడ్డుగా వచ్చే కమర్షియల్ హంగులతో ఉన్న సినిమాలను ఆడియన్స్ రిజెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ కి కూడా అలాంటి పరిస్థితి వస్తుందేమో అని అభిమానులు భయపడుతున్నారు. మరి ఎలాంటి ఫలితం రాబోతుందో తెలియాలంటే ఆగస్టు 15 వరకు ఆగాల్సిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here