Tamannaah Bhatia : అయ్యో.. ఏమైంది తమన్నా ఇలా ఇసుకలో కూరుకు పోయిందేంటి.. ఎవరైనా రక్షించండి

- Advertisement -


Tamannaah Bhatia : ‘శ్రీ’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అందాల తార తమన్నా. ఫస్ట్ సినిమాతో కలర్ తప్ప కంటెంట్ లేదని ఆమెపై పలు రకాల కామెంట్స్ చేశారు జనాలు. కానీ తర్వాత వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. కలర్ కాదు కంటెంట్ కూడా ఉందని నిరూపించుకుని.. వరుసగా సినిమాల్లో ఛాన్సులతో పాటు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇండస్ట్రీలోకి అలా వచ్చి నాలుగైదు సినిమాలు చేసిన చాలా మంది హీరోయిన్లు కనుమరుగవుతున్నా.. ఈ అమ్మడు మాత్రం గత పదేళ్లకు పైగా ఇండస్ట్రీని ఏలుతుంది. ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో మొదటి వరుసలో నిలిచింది.

Tamannaah Bhatia
Tamannaah Bhatia

టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి దశాబ్దం దాటుతున్న తన గ్లామర్ తో కుర్రాళ్లలో క్రేజ్ మరింతగా పెంచుకుంటుంది. తాజాగా లస్ట్ స్టోరీస్ 2 బోల్డ్ వెబ్‌సిరీస్‌లతో బాలీవుడ్ లో కూడా తన హవా చాటింది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. బాలీవుడ్ లోనే సహనటుడు విజయవర్మతో ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుంది. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి స‌ర‌సన నటించి మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించుకుంది.

Tamannaah

ఓ పక్కన సినిమాల్లో రాణిస్తూనే సోషల్ మీడియాలోనూ హాట్ హాట్ ఫోటోలతో రచ్చ రచ్చ చేస్తుంది. ఈ బ్యూటి తాజాగా మరోసారి తన అందాలతో కళ్లు చెదిరే పోజులు ఇచ్చింది. క్యాజువల్ అవుట్ ఫిట్ లో అందాలను ఆరబోసింది. జిమ్లో అనేక ప్రాంతాల్లో మేకప్ లేకుండా ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటితో పాటు తమన్న సముద్రపు ఒడ్డున ఇసుకలో తన శరీరాన్ని కప్పేసుకున్న ఫోటోలు చాలా అడ్వెంచర్స్ గా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పిక్స్ చూసిన తన అభిమానులు పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here