షూటింగ్ మధ్యలో చిరంజీవి కారవాన్‌లోకి కూడా వెళ్లకుండా వాళ్లతో ఉంటారుట

- Advertisement -

సుదీర్ఘ విరామం తర్వాత ఆయన మళ్లీ మెగాఫోన్‌ పట్టి… చిరంజీవి కథానాయకుడిగా ‘భోళాశంకర్‌ చిత్రాన్ని తెరకెక్కించారు మెహర్‌ రమేశ్‌. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా మెహర్‌ రమేశ్‌ మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘భోళా శంకర్’ విశేషాలను, చిరంజీవి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇన్ని రోజుల విరామం గురించి మాట్లాడుతూ.. ‘‘కథలు సిద్ధం చేసుకునే పనిలోనే ఉన్నా. అన్నయ్య చిరంజీవి మళ్లీ సినిమాల్లోకి పునః ప్రవేశం చేశాక… నా తదుపరి సినిమా ఆయనతోనే చేయాలని నిర్ణయించుకున్నా. మన గురించే అన్నయ్య తిరిగొచ్చారని భావించి… నా పునః ప్రవేశం ఆయన సినిమాతోనే జరగాలనుకున్నా (నవ్వుతూ). ‘షాడో’లో ఉన్న నాపై మెగా లైట్‌ పడిందని మొన్న వేడుకలోనూ చెప్పా’’ అన్నారు.

చిరంజీవి
చిరంజీవి

చిరంజీవి గురించి సరదాగా చెప్పారు. ‘‘ఆయనతో ఎవరు సినిమా చేసినా సరే, తగిన సలహాలు సూచనలు ఇస్తుంటారు. కథ పరంగానైనా, ఇతరత్రా విషయాల పరంగానైనా ఆయన ఆమోదముద్ర పడిన తర్వాతే సినిమా మొదలవుతుంది. మన ఆలోచనల్ని వింటూనే, ఆయన విలువైన సూచనలు చేస్తారు. మన ఆలోచనలు కొత్తగా ఉంటే వెంటనే ప్రశంసిస్తూ భుజం తడుతుంటారు. దర్శకులకి ఏం కావాలో అన్నయ్యకి బాగా తెలుసు. ఏ కథకి ఎవరి పనితీరు బాగుంటుందో కూడా ఆయనకి తెలుసు. మోహన్‌రాజా, బాబీ… ఇలా మా అందరికీ ఆయన అవకాశం ఇచ్చారంటే కారణం అదే. అన్నయ్య సెట్లో ఉన్నారంటే అక్కడంతా పండగ వాతావరణం ఉంటుంది. ఆయన కారవాన్‌లోకి కూడా వెళ్లకుండా… చుట్టూ హాస్యనటులతో కలిసి సరదాగా గడుపుతుంటారు’’ అని చెప్పారు.

bhola-shankar keerthy suresh

ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ ను తీసుకోవడం గురించి మాట్లాడారు..‘‘మెగాస్టార్‌ పక్కన ఓ మెగా నటి కనిపించాలి. ఎవరైతే బాగుంటుందా అని ఆలోచిస్తూనే… ఈ పాత్ర గురించి నిర్మాత స్వప్న దత్‌కి చెప్పా. నాకు సోదరిలాంటి తన ద్వారానే కీర్తిని సంప్రదించా. కథ చెప్పాక ఆమె కూడా చేయడానికి ఒప్పుకున్నారు. ‘వాల్తేరు వీరయ్య’లో సోదర బంధం ఎంత బలంగా ప్రేక్షకుల్ని తాకిందో.. ఇందులో అన్నాచెల్లెళ్ల బంధం అంతగా ప్రభావితం చేస్తుంది. ఇక సంగీతం విషయంలో యువతరం అభిరుచులు కనిపించాలనే మహతి స్వరసాగర్‌ పేరు చెప్పా. అన్నయ్య వెంటనే… ‘ఎస్‌.. మనం ప్రోత్సహించాలి’ అన్నారు. సాగర్‌ మా నమ్మకాన్ని నిలబెడుతూ మంచి పాటలు ఇచ్చారు. మాకు అంతే తపన ఉన్న నిర్మాత అనిల్‌ సుంకర తోడయ్యారు. సినిమా అంటే ప్రేమ ఆయనకి. ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాని నిర్మించారు’’అని వెల్లడించారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com