ప్రస్తుతం టాలీవుడ్లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇటీవలే హీరో శర్వానంద్ ఓ ఇంటివాడయ్యాడు. మెగా హీరో వరుణ్‌తేజ్ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. తాజాగా యంగ్ హీరోయిన్ మేఘా ఆకాష్ కూడా పెళ్లిపీటలెక్కబోతున్నట్లు ప్రచారం మొదలైంది. తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడి కుమారుడితో మేఘా ఆకాష్ పెళ్లి ఫిక్సయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ వార్తలపై ఆమె తల్లి స్పందించారు. తన కుమార్తె పెళ్ళి చేసుకోబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో రవ్వంత కూడా నిజం లేదని, ఇలాంటి వార్తలను ప్రసారం చేయవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. తన కుమార్తెపై సాగుతున్న ప్రచారాన్ని ఖండించిన ఆమె.. పెళ్ళి వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు.

అంతకు ముందు త్వరలో ఈ చెన్నై బ్యూటీ పెళ్లి పీటలెక్కనున్నట్లు కోలీవుడ్ మీడియా సైతం కోడై కూసింది. కన్యాకుమారికి చెందిన ప్రముఖ రాజకీయవేత్త, వ్యాపారవేత్త కొడుకును మేఘా ఆకాష్ పెళ్లి చేసుకోనుందని.. మేఘా కొంతకాలంగా అతనితో ప్రేమలో ఉందని, ఇటీవల ఇరు కుటుంబాల సభ్యులు పెళ్లికి అంగీకారం తెలిపారనేలా వార్తలు వైరల్ అయ్యాయి. ఇదే విషయాన్ని కోలీవుడ్ మీడియా కూడా విపరీతంగా వైరల్ చేసింది. త్వరలోనే నిశ్చితార్థం అని కూడా ప్రచారం చేశాయి. ఈ విషయం బాగా వైరల్ అవుతుండటంతో మేఘా ఆకాష్ తల్లి.. మీడియాకు ఆ వార్తలలో నిజం లేదని తెలియజేశారు.