Gang leader : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ ఆరోజుల్లో ఎలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే.వరుస ఇండస్ట్రీ హిట్స్ తో మంచి జోరు మీదున్న మెగాస్టార్ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ గా నిల్చిన ఈ చిత్రం ఆ రోజుల్లోనే 9 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లను సాధించింది.మెగాస్టార్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లింది.
ఇదే సినిమాని హిందీ లో చిరంజీవి ని పెట్టి ‘ఆజ్ కా గూండారాజ్’ పేరు తో రీమేక్ చేసారు.అక్కడ కూడా బంపర్ హిట్ అయ్యింది.హిందీ లో ఆ ఏడాది విడుదలైన సినిమాలలో ఆల్ టైం టాప్ 10 మూవీస్ లో ఒకటిగా నిలిచింది ఈ చిత్రం.అలాంటి సెన్సేషన్ సృష్టించిన ఈ సినిమాని 4K కి మార్చి నిన్న గ్రాండ్ గా విడుదల చేసారు.రెస్పాన్స్ ఊహించిన దానికంటే అద్భుతంగా వచ్చింది.మెగాస్టార్ మాస్ పవర్ ఏంటో మరోసారి నిరూపించింది.
మొదటి రోజు ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్నీ మేజర్ ప్రాంతాలలో హౌస్ ఫుల్ బోర్డ్స్ పడ్డాయి.ముఖ్యంగా హైదరాబాద్ సిటీ లో ఈ సినిమాకి ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్న కొత్త సినిమాలకంటే ఎక్కువ కలెక్షన్స్ ని నమోదు చేసుకుంది.ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు 50 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంచనా వేస్తున్నారు.అసలు ఎలాంటి అకేషన్ లేకుండా ఒక సినిమాని విడుదల చేసి ఈమాత్రం వసూళ్లను రాబట్టడం అంటే సాధారమైన విషయం కాదు.
గతం లో జూనియర్ ఎన్టీఆర్ హీరో గా నటించిన ‘బాద్షా’ చిత్రాన్ని ఇలాగే రీ రిలీజ్ చేసారు.కనీసం ప్రింట్ ఖర్చులను కూడా వసూలు చెయ్యలేకపోయింది.ఆ తర్వాత ప్రభాస్ హీరో గా నటించిన వర్షం , రెబెల్ వంటి సినిమాలను రీ రిలీజ్ చేసినప్పుడు కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది.అలాంటిది మెగాస్టార్ చిరంజీవి పాత చిత్రానికి ఈ స్థాయి వసూళ్లు వచ్చాయంటే ఆయన రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చునని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.