Chiranjeevi : ఈ ఏడాది ప్రారంభం లో సంక్రాంతి కానుకగా ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాన్ని విడుదల చేసి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి, ఆ తర్వాత మెహర్ రమేష్ తో ‘భోళా శంకర్’ చిత్రాన్ని ఆగస్టు లో విడుదల చేసి భారీ డిజాస్టర్ ఫ్లాప్ ని ఎదురుకున్నాడు. నాలుగు దశాబ్దాల మెగాస్టార్ సుదీర్ఘ సినీ ప్రస్థానం లో ఇలాంటి డిజాస్టర్ ఫ్లాప్ సినిమా లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కి అర్జెంటు గా ఒక బ్లాక్ బస్టర్ హిట్ కావాలి, ఆ హిట్ ఎలా ఉండాలంటే చిరంజీవి కి భోళా శంకర్ తెచ్చిపెట్టిన నెగటివిటీ మొత్తం మర్చిపోయేలా చెయ్యాలి. దానికి తగ్గట్టుగానే మెగాస్టార్ తన తదుపరి చిత్రాన్ని ప్లాన్ చేసుకున్నాడు. కళ్యాణ్ రామ్ తో ‘భింబిసారా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాని చేసిన వసిష్ఠ చిరంజీవి తో త్వరలోనే ఒక సినిమా చెయ్యబోతున్నాడు.

పీరియడ్ నేపథ్యం లో సాగే ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నాడు ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు. ఇక నేడు దసరా సందర్భంగా ఘనంగా ప్రారంభించారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి మూడు లోకాల్లో ప్రయాణం చెయ్యబోతున్నాడు. సినిమా పేరు ‘ముల్లోకవీరుడు’ అని తెలుస్తుంది. తన కూతుర్ని వెతుక్కుంటూ వెళ్లే తండ్రిగా ఇందులో మెగాస్టార్ కనిపించబోతున్నాడు.

నవంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకోబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి లుక్స్ కూడా చాలా కొత్తగా ఉండబోతున్నాయి. రీ ఎంట్రీ తర్వాత ఆయన ఏ సినిమాలో కూడా గెడ్డం లేకుండా లేదు. కానీ ఈ సినిమాలో మాత్రం మెగాస్టార్ చిరంజీవి క్లీన్ షేవ్ లుక్ లో కనిపించబోతున్నాడు. సుమారుగా 150 కోట్ల రూపాయిల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది.