Bhagavanth Kesari : ‘భగవంత్ కేసరి’ సినిమాలో విజ్జి క్యారెక్టర్ మిస్ చేసుకున్న ఆ అన్ లక్కీ హీరోయిన్ ఎవరో తెలుసా?

- Advertisement -

Bhagavanth Kesari : సినిమా అనేది రంగుల ప్రపంచం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఇండస్ట్రీలో ఒక్కో సారి కొంత మంది చేయాల్సిన సినిమాలు మరొకరి చేతుల్లోకి వెళ్లడం కామన్. ఓ రోల్ కోసం ఎంపిక చేసుకున్న.. బ్యూటీ ప్లేస్‎లో మరో బ్యూటీని సెట్ చేసుకోవాల్సి వస్తుంటుంది. కారణాలు ఏవైనా కానీ అలా మిస్ చేసుకున్న ఆ రోల్ మరో హీరోయిన్ చేతికి వెళ్లి భారీ హిట్ పడితే ఆ బాధ వర్ణణాతీతం. ప్రస్తుతం అలాంటి పరిస్థితినే ఫేస్ చేస్తుంది టాలీవుడ్ బేబమ్మ కృతి శెట్టి. కన్నడ బ్యూటీ కృతి శెట్టి చేతులారా తనకు వచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని మిస్ చేసుకుంది.

Bhagavanth Kesari
Bhagavanth Kesari

వాస్తవానికి భగవంత్ కేసరి సినిమాలో విజ్జి పాత్రలో శ్రీ లీల కన్నా ముందే కృతి శెట్టిని అనుకుని సంప్రదించారట మేకర్స్. కానీ కూతురు పాత్ర చేస్తే హీరోయిన్ అవకాశాలు రావేమో అని భావించిన కృతి శెట్టి ఆ పాత్రను భయం భయంగానే వద్దని రిజెక్ట్ చేసిందట. ఆ తర్వాతే ఫైనల్లీ శ్రీలీల ఆ పాత్రకు ఎంపిక చేసిందన చిత్రబృందం. ఇప్పుడు కృతి శెట్టి ఆ పాత్రలో ఉండి ఉంటే మరో హిట్ తన ఖాతాలో వేసుకుని ఉండేదంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

kriti-shetty

సినిమాలో శ్రీలీల బాలయ్య బాబు పెంపుడు కూతురుగా విజ్జి పాప అనే పాత్రలో నటించింది. ఓ పక్క బాలయ్యతో ఎమోషనల్ సీన్స్, మరో పక్క డ్యాన్సులు, కాలేజీ అమ్మాయిలా జీవించేసింది. అయితే ఇన్నాళ్లు డ్యాన్సులతో మెప్పించిన శ్రీలీల ప్రస్తుతం యాక్షన్స్ సీక్వెన్స్ లో అదరగొట్టేసిందట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here