ఆ కుర్ర హీరోయిన్ లేకపోతే సినిమానే చెయ్యను అంటూ డైరెక్టర్ కి మెగాస్టార్ చిరంజీవి స్ట్రాంగ్ వార్నింగ్!

- Advertisement -

ఈమధ్య కాలం లో ఇండస్ట్రీ కి వచ్చిన హీరోయిన్స్ లో కేవలం ఒకటి రెండు సినిమాలతోనే అశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్న వారిలో ఒకరు సంయుక్త మీనన్. ఈమె టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వకముందే మలయాళం లో పెద్ద హీరోయిన్. తెలుగులో మొట్టమొదటిసారిగా ఈమె ‘భీమ్లా నాయక్’ చిత్రం తో మన ముందుకి వచ్చింది. ఈ సినిమా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో సంయుక్త మీనన్ కి టాలీవుడ్ లో అవకాశాల వెల్లువ కురిసింది.

సంయుక్త మీనన్
సంయుక్త మీనన్

‘భీమ్లా నాయక్’ తర్వాత ఈమె చేసిన ‘భింబిసారా’ , ‘సార్’ మరియు ‘విరూపాక్ష’ వంటి చిత్రాలు ఒక దానిని మించి ఒకటి హిట్ అయ్యాయి. దీంతో ఈమెకి టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ అనే పేరు వచ్చింది. అయితే సక్సెస్ రేషియో కి తగ్గట్టుగా ఈమెకి అవకాశాలు మాత్రం రావడం లేదు, కారణం శ్రీలీల వల్లే. టాలీవుడ్ మొత్తం ఇప్పుడు ఆమె మాయలో మునిగి తేలుతుంది.

ఆమె డేట్స్ దొరకని వాళ్ళు సంయుక్త మీనన్ వంటి హీరోయిన్స్ వద్దకి వెళ్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి తదుపరి చెయ్యబోయే చిత్రం లో మాత్రం సంయుక్త మీనన్ ని తీసుకోవాలి అంటూ డైరెక్టర్ వశిష్ఠ కి చాలా స్పష్టం గా తెలియచేసాడట. త్వరలోనే చిరంజీవి ఆయనతో ఒక సోషియో ఫాంటసీ చిత్రం చెయ్యబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. ఒక హీరోయిన్ పాత్ర నటన కి పూర్తి స్థాయి ప్రాధాన్యం ఉన్నది అట.

- Advertisement -

ఆ పాత్ర కి కేవలం సంయుక్త మీనన్ మాత్రమే న్యాయం చెయ్యగలదు అని, ఆమె ఒప్పుకున్న తర్వాతే ఈ సినిమా షూటింగ్ ని ప్రారంభిద్దాం అని చిరంజీవి అన్నాడట. మెగాస్టార్ పనిగట్టుకొని సంయుక్త మీనన్ మాత్రమే కావాలి అని అంటున్నాడు అంటే ఆ పాత్ర ఎంత బలమైనదో అర్థం చేస్కోవచ్చు. నవంబర్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here