Chiranjeevi : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎలాంటి కాంట్రవర్సీలు లేని హీరోల లిస్ట్ తీస్తే అందులో మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉంటాడు..నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణం లో చిరంజీవి మీద వ్యక్తిగతం గా ఒక్క కాంట్రవర్సీ కూడా లేదు..అల్లు రామలింగయ్య గారి కుమార్తె సురేఖ ని ఇండస్ట్రీ లోకి వచ్చిన ఆరేళ్లకు పెళ్లి చేసుకున్నాడు..తొందరగా వైవాహిక జీవితం లోకి అడుగుపెట్టాడు కాబట్టే చిరంజీవి మీద ఎలాంటి కాంట్రవర్సీ లేదని అందరూ అనుకున్నారు.
కానీ మీడియా గమ్మున ఉండదు కదా.. ఒక హీరో హీరోయిన్ కలిసి రెండు మూడు సినిమాల్లో నటిస్తే వాళ్ళిద్దరి మీద బోలెడన్ని పుకార్లు పుట్టించి తమ రాతలతో పెళ్లి కూడా చేసేస్తారు.. చిరంజీవి విషయం లో కూడా అలాంటిదే జరిగింది.. ఆరోజుల్లో చిరంజీవి రాధా , సుమలత , రాధికా మరియు విజయశాంతి వంటి హీరోయిన్స్ తో రిపీట్ గా చాలా సినిమాలు చేసాడు.
వీరిలో సుమలత తో చిరంజీవి ప్రేమాయణం నడిపాడని.. వాళ్లిద్దరూ డేటింగ్ చేసుకుంటున్న విషయం సురేఖ కి తెలిసి చిరంజీవి ఇంట్లో గొడవలు కూడా అయ్యాయని, ఇలాంటి వార్తలు జోరుగా ప్రచారం సాగాయి.. అయితే ఈ వార్తలపై సుమలత ఆరోజుల్లో చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడి అలాంటి ప్రచారాలను చేసిన వారిపై పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది.. చిరంజీవి కూడా ఈ విషయం పై చాలా తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యి ఆ పుకార్లను ఖండించాడు.
ఎప్పుడైతే ఈ పుకార్లు వచ్చి రచ్చ రచ్చ అయ్యిందో అప్పటి నుండి వీళ్లిద్దరు కలిసి సినిమాలు చేయకూడదనే నిర్ణయానికి వచ్చారు.. కానీ సుమలత మరియు ఆమె భర్త అంబరీష్ మెగాస్టార్ చిరంజీవి కి అత్యంత ఆప్త మిత్రులు.. కానీ దురదృష్టం కొద్దీ అంబరీష్ కాలం చెందిన సంగతి మన అందరికీ తెలిసిందే.. ఇప్పటికి సుమలత చిరంజీవి కుటుంబం తో ఎంతో ఆత్మీయంగా ఉంటుంది.