రామ్చరణ్-ఉపాసన దంపతులకు జూన్ 20న మంగళవారం పండంటి పాప జన్మించిన విషయం తెలిసిందే. దీంతో మెగా కుటుంబంలోకి దాదాపు పదకొండేళ్ల విరామం తరువాత లిటిల్ ప్రిన్సెస్ అడుగు పెట్టింది. ఉపాసన ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిన దగ్గరి నుంచి మెగా కుటుంబంలో సంబరాలు మొదలు కావడం తెలిసిందే. పాప పుట్టాక ఆ క్షణం నుంచి మెగా ఇంట సంబరాలు అంబరాన్నంటాయి. చిరంజీవి ఆనందానికి ఆకాశమే హద్దుగా మారింది.
పాపకు క్లీంకార కొణిదెల అని నామకరణం చేశారు. ఈ పేరుని లలితా సహస్రనామం నుంచి తీసుకున్నామని నామకరణం సందర్భంగా వెల్లడించారు. ఆధ్యాత్మిక మేల్కొల్పుని కలిగించే శుద్దమైన శక్తిని, పరివర్తనని ఈ పేరు సూచిస్తుందని, మా చిన్న యువరాణీ ఈ లక్షణాలన్నింటినీ తన వ్యక్తిత్వంలో ఇముడ్చుకుంటూ పెరుగుతుందని మేమంతా నమ్ముతున్నాం
అంటూ చిరు ట్వీట్ చేశారు. శుక్రవారం అట్టహాసంగా జరిగిన నామకరణ మహోత్సవంలో సినీరంగ,రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో హాజరైన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన బహుమతుల్ని మెగా ఫ్యామిలీ అందజేసిందిట. ప్రతి ఒక్కరికి ఖరీదైన పట్టుచీరతో పాటు గాజులు, గోల్డ్ కాయిన్ని బహుమతులుగా అందజేసినట్లు సమాచారం. బారసాల ఫంక్షన్కు సంబంధించిన వీడియోలు, బారసాల ఇన్విటేషన్, ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. పాప పుట్టిన నేపథ్యంలో రామ్ చరణ్ కొన్ని రోజుల పాటు షూటింగ్లకు బ్రేకివ్వనున్నారని తెలిసింది. ఉపాసన డెలివరీ సమయంలో అపోలో హాస్పిటల్ ఆవరణలో మెగా ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. పాప పుట్టిందని తెలియగానే అభిమానులు స్వీట్లు పంచుతూ టాపాసులు సేలుస్తూ చాలా మందికి ప్రత్యేకంగా బహుమతులు కూడా అందజేశారు. ఇదిలా ఉంటే ఈ శుక్రవారం మెగా కుటుంబం మెగా ప్రిన్సెస్ బారసాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదే సందర్భంగా పాపకు ప్రత్యేకంగా ఉండేలా ప్రత్యేకమైన పేరుని పెట్టారు.