Meenakshi Chaudhary : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాప కింద నీరులా వచ్చి మెల్లగా ఇండస్ట్రీలో పాతుకుపోతుంది. ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో రెండు, మూడు సినిమాల్లో నటించినప్పటికీ ఆమెను పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు మాత్రం దక్షిణాదిలో ఆమె క్రేజ్ ఓ రేంజ్లో ఉంది. మహేష్ బాబు నుంచి విజయ్ దళపతి వరకు అందరితోనూ ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. 2021లో సుశాంత్ హీరోగా నటించిన ఇచట వాహనాలు నిలపరాదు సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత రవితేజ కిలాడీ లోను నటించింది.

అయితే రెండు ఫ్లాప్ కావడంతో తనకు పెద్దగా కలిసి రాలేదు. హిట్ 2 సక్సెస్ సాధించినా స్టార్ ఫేమ్ రాలేదు. గ్లామర్ షోకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వెళుతున్న మీనాక్షి చౌదరికి అవకాశాలు ఎవరూ ఇవ్వలేదు. అయితే మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో పూజ హెగ్డే తప్పుకోవడంతో.. మెయిన్ హీరోయిన్ ప్లేస్‌లో శ్రీలీలను ఉంచి.. సెకండ్ హీరోయిన్ ను మీనాక్షి చౌదరిని తీసుకొచ్చాడు దర్శకుడు త్రివిక్రమ్. దీంతో తన ఫేట్ మారిపోయింది.

ప్రస్తుతం దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి.. లక్కీ భాస్కర్, విశ్వక్‌సేన్.. రామ్ తాళ్లూరి, వరుణ్ తేజ్.. మట్కా ఇలా వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఈమధ్య ఈమెకు మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలిసింది. దళపతి విజయ్ హీరోగా వెంకట ప్రభు డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమాలోనూ మీనాక్షినే హీరోయిన్ గా సెలెక్ట్ చేశారట. దీంతో తమిళంలోనూ ఈ క్యూటీ పేరు మార్మోగిపోతుంది. మొత్తానికి చప్పుడు లేకుండా వచ్చి సైలెంట్ కిల్లర్ గా మారిపోయిందంటున్నారు జనాలు.