Meenakshi Chaudhary : సంక్రాంతి కానుకగా విడుదలైన మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రం లో మెయిన్ హీరోయిన్ శ్రీలీల కంటే అందంగా కనిపిస్తూ, చక్కటి అభినయం కనబర్చిన మీనాక్షి చౌదరి కి అసలు ఏమాత్రం ప్రాముఖ్యత లేని పాత్ర ఇచ్చినందుకు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై అభిమానులు, ప్రేక్షకులు విరుచుకుపడ్డారు. అంత అందమైన అమ్మాయితో అంట్లు తోమించడం,టీ – కాఫీలు అందించడం, ఒక పని మనిషి లాగ చూపించడం త్రివిక్రమ్ పైత్యానికి నిదర్శనం.
అతని సినిమాల్లో సెకండ్ హీరోయిన్స్ ని ఇంత నీచంగా చూపిస్తూ వస్తుంటాడు అని రకరకాలుగా సోషల్ మీడియా లో కామెంట్స్ వినిపించాయి. నిజానికి ఆ కామెంట్స్ అన్నీ సమంజసమే కదా అని అనిపిస్తుంది మీనాక్షి చౌదరి బ్యాక్ గ్రౌండ్ ని చూస్తే. ఈమె సినిమాల్లోకి రాకముందు ఫెమినా మిస్ ఇండియా పోటీలలో పాల్గొని టైటిల్ ని గెలిచింది. అంతే కాదు ఈమె విద్యాబ్యాసం కూడా చాలా ఉన్నతమైనది.
రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుతూ తాను ఒక సర్టిఫైడ్ డెంటిస్ట్ ని అని, నేషనల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో డెంటల్ కోర్స్ ని పూర్తి చేసానని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చింది. అంతే కాదు ఈమె స్టేట్ లెవెల్ లో జరిగిన స్విమ్మింగ్ కాంపిటీషన్ లో ఛాంపియన్ గా కూడా నిల్చింది. కేవలం ఇక్కడితో ఆగిపోలేదు, ఈమె స్టేట్ లెవెల్ లో బ్యాడ్మింటన్ ప్లేయర్ గా కూడా రాణించింది అట.
సినిమాలు లేకపోతే ఈమె ఇన్ని రంగాలలో రాణించగలదు. అలాంటి టాలెంట్ ఉన్న అమ్మాయితో పని మనిషి వేషం వెయ్యించాలనే ఆలోచన త్రివిక్రమ్ కి ఎలా వచ్చిందో. పోనీ అలాంటి పాత్ర చెయ్యడానికి మీనాక్షి చౌదరి ఎలా ఒప్పుకుంది అనే సందేహం మీకు రావొచ్చు. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ‘మహేష్ బాబు పక్కన 5 నిమిషాల పాత్రని చెయ్యమన్నా చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె ఈ పాత్ర ఇష్టపడే చేసింది అని అందరికీ అర్థం అయ్యింది.