Allu Arjun : టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ నటవారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అందరి చేత స్టైలీష్ స్టార్ అనిపించుకున్నాడు అల్లు అర్జున్. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఈ సినిమా ఏకంగా ఇండియా లెవల్లో దాదాపు రూ.500కోట్లతో బాక్సాఫీసు బద్దలు కొట్టింది.

పాన్ ఇండియా లెవెల్లో రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాతో బన్నీ ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్లో తన స్టామినా ఏంటో చూపించాడు. త్వరలోనే ఆయన గ్లోబల్ హీరోగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. పుష్ప సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న పుష్ప2 సినిమాతో ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దలు కొట్టడానికి సిద్దమవుతున్నాడు. ఈ క్రమంలోనే బన్నీకి సంబంధించిన ఓ వార్త అభిమానులకు నిద్ర పట్టకుండా చేస్తోంది.
ప్రస్తుతం పుష్ప2 సినిమా షూటింగ్లో బన్నీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని దేశం మొత్తం ఆత్రుతగా ఎదురుచూస్తుంది. రీసెంట్ వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఇప్పుడు సినీ సెలబ్రిటీల జాతకం చెప్పే ఓ స్వామి అల్లు అర్జున్ జాతకంలో పెద్ద దోషం ఉందని తేల్చేశాడట.

దీని కారణంగా బన్నీ తన కెరీర్ లోనే భారీ డిజాస్టర్ ఎదుర్కోబోతున్నాడ.. పరిహార పూజలు చేయకపోతే లైఫ్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుందని చెప్పాడట. దీంతో రాత్రికి రాత్రి అల్లు అర్జున్ అమ్మ పరిహార పూజలు చేయించడానికి ఏర్పాట్లు చేసిందట. అల్లు ఫామ్ హౌస్ లో బన్నీ, స్నేహ రెడ్డి, అర్హ, అయాన్ ఈ పూజలో పాల్గొన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బన్నీకి నరదిష్టి ఎక్కువగా ఉందని పూజల అనంతరం బన్నీ జాతకం ప్రకారం ఇండస్ట్రీ ని ఏలతాడంటూ ఆ పూజారి చెప్పారట.. దీంతో అల్లు అర్జున్ అమ్మ వెంటనే ఇలాంటి నిర్ణయం తీసుకుని పూజలు చేయించారట.