Cheeranjivi : త్రిష విషయంలో అనవసరంగా గెలికిన చిరంజీవి.. కేసు పెట్టిన మన్సూర్ అలీఖాన్..

- Advertisement -

Cheeranjivi : మన్సూర్ అలీ ఖాన్ యూ టర్న్ తీసుకున్నారు. కథానాయిక త్రిషకు క్షమాపణ చెప్పి కనీసం వారం కూడా గడవక ముందు కొత్త వివాదానికి తెర తీశారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. త్రిషకు మద్దతుగా ‘లియో’ దర్శకుడు లోకేష్ కనగరాజ్, మెగాస్టార్ చిరంజీవి, యువ హీరో నితిన్, నటి ఖుష్బూ, హీరోయిన్లు మాళవికా మోహనన్ తదితరులు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. వివాదం పెద్దది కావడంతో మన్సూర్ అలీ ఖాన్ క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత ‘తప్పు చేయడం మానవత్వం…. క్షమించడం దైవత్వం’ అని త్రిష పేర్కొన్నారు.

Cheeranjivi
Cheeranjivi

దాంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడిందని అందరూ భావించారు. ఈ సమయంలో మన్సూర్ అలీ ఖాన్ మరో కొత్త వివాదానికి తెర తీశారు. త్రిషతో పాటు చిరంజీవి, ఖుష్బూ మీద కేసు నమోదు చేయనున్నట్లు మన్సూర్ అలీ ఖాన్ తాజాగా వెల్లడించారు. తన లాయర్ గురు ధనుంజయ్ ద్వారా చెన్నై కోర్టులో సోమవారం కేసు వేయనున్నట్లు ఓ లేఖ విడుదల చేశారు. పది రోజుల పాటు ప్రజాశాంతికి విఘాతం కలిగించారని, వ్యభిచారానికి ప్రేరేపిస్తూ అల్లర్లు సృష్టించాలని ప్లాన్ చేశారని ఆయన కొత్త పలుకులు చెప్పారు.

క్రిమినల్, సివిల్ దావా వేస్తామన్నారు. తాను విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాటలను వారం తర్వాత ఎడిట్ చేశారని, త్రిష గురించి తాను తప్పుగా మాట్లాడినట్లు అసభ్యంగా చిత్రీకరించారని, తాను పూర్తి ఆధారాలతో కేసు వేయనున్నట్లు మన్సూర్ అలీ ఖాన్ తెలిపారు. ఆయన నిర్ణయం పట్ల భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముగిసిన గాయాన్ని మళ్ళీ ఆయన గుర్తు చేస్తున్నారని, వివాదాన్ని మరింత పెద్దది చేయాలని ఆయన చూస్తున్నారని సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here