Animal : ‘ఎనిమల్’ చిత్రం లో విలన్ రోల్ ని మిస్ చేసుకున్న తెలుగు హీరో అతనేనా..? భలే ఛాన్స్ మిస్ అయ్యాడుగా!

- Advertisement -

Animal : బాలీవుడ్ ఆడియన్స్ తో పాటుగా టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న సినిమాలలో ఒకటి ‘ఎనిమల్’. డిసెంబర్ 1 వ తేదీన ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల అవ్వబోతుంది. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చెయ్యగా దానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Animal
Animal

‘అర్జున్ రెడ్డి’ మరియు ‘కబీర్ సింగ్’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత సందీప్ వంగ చేస్తున్న సినిమా కావడం తో మొదటి నుండి ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉండేవి. ఇక రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ ఈ చిత్రం పై అంచనాలను అమాంతం పెంచేసాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అన్నీ ప్రాంతాలలో అద్భుతంగా ఉన్నాయి. ఇక మూవీ యూనిట్ అటు బాలీవుడ్ తో పాటుగా, టాలీవుడ్ లో కూడా ప్రమోషన్స్ అదరగొడుతున్నారు.

ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో విలన్ గా ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్ నటించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఆయన క్యారక్టర్ అద్భుతంగా వచ్చింది అనే విషయం మనకి ట్రైలర్ ని చూసినప్పుడే అర్థం అయ్యింది. అయితే సందీప్ వంగ ఈ క్యారక్టర్ ని తొలుత హీరో రానా తో చేయించాలని అనుకున్నాడట.

- Advertisement -

కానీ రానా కి ఆరోగ్య సమస్యలు ఉండడం, ఆ సమయం లో ఆయన విదేశాల్లో చికిత్స తీసుకుంటూ ఉండడం తో ఈ చిత్రం చెయ్యాలని ఉన్నప్పటికీ కూడా అయిష్టంగానే రిజెక్ట్ చెయ్యాల్సి వచ్చిందట. హీరో రణబీర్ కపూర్ కటౌట్ ని మ్యాచ్ చేసే సత్తా ఉన్న ఏకైక హీరో రానా మాత్రమే. రానా ఈ చిత్రం చేసి ఉంటే హీరో మరియు విలన్ క్యారెక్టర్స్ అంటే ఇలా ఉండాలి అనిపించేలా ఉండేది. కానీ ఈ చిత్రాన్ని ఆయన మిస్ అవ్వడం సినిమాకి పెద్ద అసెట్ మిస్ అయ్యినట్టే అని చెప్పొచ్చు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here