Manjima Mohan  : పెళ్లిలోనూ ఆ కామెంట్స్ తప్పలేదు.. వివాహం తర్వాత మంజిమా మోహన్ వ్యాఖ్యలు

- Advertisement -

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎక్కువ కాలం ఉండాలంటే గ్లామర్ తప్పకుండా కాపాడుకోవాల్సిందే. ఇక ఫిట్ నెస్ పై చాలా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం బొద్దుగా ఉన్నా ఫ్యాన్స్ ఇష్టపడతారు. కానీ కొన్నిసార్లు బాడీషేమింగ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. నిత్యా మీనన్, విద్యా బాలన్ వీళ్లంతా ఎంతటి స్టార్ డమ్ సంపాదించుకున్నా.. ఇప్పటికీ ఏదోచోట బాడీ షేమింగ్ ఎదుర్కొంటున్న వారే. తాజాగా ఈ కోవలో చేరింది మలయాళి కుట్టి Manjima Mohan .

Manjima Mohan
Manjima Mohan 

తమ మూడేళ్ల ప్రేమబంధాన్ని ఇటీవల వివాహబంధంగా మార్చుకున్నారు నటుడు గౌతమ్‌ కార్తిక్, నటి మంజిమా మోహన్‌. వివాహం అనంతరం తొలిసారి మీడియాతో మాట్లాడిన మంజిమ.. ప్రేమ, పెళ్లి, కెరీర్‌పై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పెళ్లి ఫొటోల్లో తాను లావుగా ఉన్నానంటూ వస్తోన్న విమర్శలపై మంజిమా మోహన్‌ స్పందిస్తూ.. ‘‘నిజం చెప్పాలంటే.. మా పెళ్లిలోనూ కొంతమంది నేను లావుగా ఉన్నానని కామెంట్ చేశారు. శరీరాకృతి విషయంలో ఎంతోకాలం నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాను. అయితే, మొదట్లో కాస్త బాధపడ్డా. కానీ, ఇప్పుడు నేను ఫిట్‌, సంతోషంగానే ఉన్నా. నాకు తగ్గాలనిపించినప్పుడు తప్పకుండా తగ్గుతా’’ అని తెలిపారు. కెరీర్‌ గురించి స్పందిస్తూ తాను నటిగానే కొనసాగాలనుకుంటున్నానని, మంచి కథల్లో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని అన్నారు.

కోలీవుడ్‌లో తెరకెక్కిన ‘దేవరట్టం’ సినిమాతో గౌతమ్‌ కార్తిక్‌, మంజిమ మొదటిసారి కలిసి పనిచేశారు. ఈ సినిమా షూట్‌లో వీరిద్దరూ స్నేహితులయ్యారు. అనంతరం ప్రేమలో పడ్డారు. అయితే, వీరిద్దరూ మూడేళ్ల పాటు సహజీవనంలో ఉన్నారంటూ గతంలో వార్తలొచ్చాయి. వాటిపై తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజిమ స్పందించారు. ‘‘లాక్‌డౌన్‌ సమయంలో కుటుంబానికి దూరంగా నేను ఒక్కదానినే చెన్నైలో ఉన్నాను. గౌతమ్‌ వాళ్లింట్లో ఉన్నాడు. అయితే, మేమిద్దరం కలిసి అప్పుడప్పుడు బయటకు వెళ్లేవాళ్లం. దాంతో మేము సహజీవనంలో ఉన్నామంటూ వార్తలు వచ్చాయి. వాటిల్లో ఎలాంటి నిజం లేదు. మేమిద్దరం సహజీవనంలో లేము’’ అని ఆమె క్లారిటీ ఇచ్చారు.

- Advertisement -

Gautham Karthik’s Srilankan Fan on Twitter: “Favourite ❤️ #GauthamKarthik #ManjimaMohan #Couple #CoupleGoals #Love https://t.co/dvr9AsXGmv” / Twitter


Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here