Rajamouli తెలుగు దిగ్గజం దర్శకుడు రాజమౌళి పేరు ఇప్పుడు అమెరికా నుంచి ఆంధ్రా వరకు మారుమోగిపోతుంది.. ఆయన దర్శకత్వం వహించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకుంది.ఇది మన దేశం గర్వించదగ్గ విషయం.. నాటు నాటు సాంగ్ ఆస్కార్ కి ఎంపిక కాగా సంగీతం, సాహిత్యం సమకూర్చిన కీరవాణి, చంద్రబోస్ వేదిక పైకి వెళ్లి ఆస్కార్ అందుకున్నారు. ఈ ఆస్కార్ గెలుచుకోవడం వెనుక సమిష్టి కృషి ఉంది. మెయిన్ క్రెడిట్ మాత్రం రాజమౌళికి ఇవ్వాల్సిందే. ఏడాది కాలంగా రాజమౌళి అమెరికాకే పరిమితమై… ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసే పనిలో ఉన్నారు.. అంటూ పొగడ్తల వర్షం కురిపించారు..

ఈ ఘనత పై సినీ రాజకీయ ప్రముఖులు తమదైనా శైలిలో స్పందిస్తూ అభినందిస్తున్నారు.. అయితే లక్ష్మీ మాత్రం సెటైర్లు వేసి తెలుగోళ్ల కోపానికి కారణమైంది.. ఆమె వేసిన సెటైర్ ఇప్పుడు ఆమెకు ట్రోల్స్ తెచ్చి పెడుతుంది.ఆ వీడియోలో రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ అని పలకగానే… మంచు లక్ష్మి అందుకుంటూ ‘ఆర్’ అని ఇలా పలికితే దొరికిపోతారు. ఆర్ అనేది నోట్లో దొర్లాలి అని చెబుతుంది. రాజమౌళి, మంచు లక్ష్మి వేర్వేరు సందర్భాల్లో మాట్లాడిన వీడియోలు జత చేసి ఆయన ఇంగ్లీష్ ఉచ్ఛరణ మీద ఫన్నీ వీడియో చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ వీడియో మీద మంచు లక్ష్మి స్పందించారు..
రామ రామ రామ… అని కామెంట్ పెట్టారు. నన్ను ఇలా కూడా ట్రోల్ చేస్తున్నారా? ఇది దారుణం అన్న అర్థంలో మంచు లక్ష్మి ఆ తరహా కామెంట్ చేశారు. మంచు లక్ష్మి ట్వీట్ వైరల్ గా మారింది. మంచు వారమ్మాయి అంత మాటలు అన్న ఆ సినిమా ఇప్పుడు ఆస్కార్ అందుకుంది అంటూ తెలుగు వాళ్ళు మండిపోతున్నారు.. మంచు లక్ష్మి చాలా కాలం అమెరికాలో ఉన్నారు. అమెరికన్ యాక్సెంట్ లో ఆమె ఇంగ్లీష్ అద్భుతంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇంగ్లీష్ పదాలు, అక్షరాలు ఎలా పలకాలో ఆమె చెప్పారు. ఆ వీడియోలను కూడా మీమ్స్ కి వాడేస్తున్నారు మీమర్స్. కాగా అమెరికాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ స్థానిక యాక్సెంట్ లో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒకింత విమర్శల పాలవుతుంది..ఏది ఏమైనా తెలుగువాళ్ళు ఆస్కార్ రావడంతో కాలర్ ఎగరేస్తున్నారు..