Manchu Vishnu : విష్ణు నటిస్తున్న ‘కన్నప్ప’ ఇటీవలే న్యూజిలాండ్ లో లాంగ్ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. ప్రస్తుతం తదుపరి షెడ్యూల్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇది ఇలా ఉంటే, రీసెంట్ గా మంచు విష్ణు సోషల్ మీడియా ద్వారా ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సెషన్ లో మంచు విష్ణుని ఓ ప్రశ్న చాలా ఇబ్బంది పెట్టిందట. దాని గురించి మాట్లాడుతూ విష్ణు ఓ సీరియస్ వీడియో రిలీజ్ చేశారు. “మొన్న ఆడియన్స్ తో జరిగిన సోషల్ మీడియా ఇంటరాక్షన్ లో చాలా మంది నన్ను ఓ క్యూస్షన్ అడిగారు.

మీ మైథలాజికల్ మూవీ కన్నప్ప ఎప్పుడు రిలీజ్ అవుతుంది..? అంటూ నన్ను ప్రశ్నించారు. అయితే నాకు ఇబ్బంది కలిగించింది ఆ ప్రశ్న కాదు. ఆ ప్రశ్నలో ఉపయోగించిన మైథలాజికల్ అనే పదం. ఈ సినిమా మైథలాజికల్ మూవీ కాదు. మైథలాజికల్ అనే పదం ఎప్పుడు ఉపయోగిస్తారంటే.. ఆ కథ నిజం కాకుండా, కల్పితం అయితే మైథలాజికల్ అని ఉపయోగిస్తారు. కానీ ఈ కన్నప్ప సినిమా మైథలాజికల్ మూవీ కాదు. ఇది మన హిస్టరీ. శ్రీకాళహస్తి గుడికి సంబంధించిన హిస్టరీ.

ఎక్కడో నాసా వాళ్ళు మన రామసేతు గురించి మాట్లాడినప్పుడు మనం రామాయణం గురించి మాట్లాడతాము. అలాగే ద్వారక గురించి కూడా. మన సమస్య ఏంటంటే.. ఇతర దేశాల వారు తమ కల్చర్ అండ్ హిస్టరీని గట్టిగా నమ్ముతారు. కానీ మనం మన చరిత్రని నమ్మడం లేదు. మన చరిత్ర గురించి తెలుసుకోవడం వరకు సరిపోదు. దానిని మనం నమ్మాలి. ఎన్నో వేల సంవత్సరాల క్రిందట శ్రీకాళహస్తి గుడిలోని లింగం కథ మా కన్నప్ప. ఇది మన చరిత్ర. మైథలాజికల్ మూవీ కాదు. త్వరలోనే మీరు కన్నప్ప ప్రపంచాన్ని చూస్తారు” అంటూ విష్ణు పేర్కొన్నారు.