Manoj మరియు మంచు విష్ణు మధ్య నిన్న జరిగిన ఒక కొట్లాట కి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ని ఎలా ఊపేసిందో మన అందరికీ తెలిసిందే.వీళ్ళ మధ్య ఎందుకు ఇంత గొడవ జరిగింది అనేది ఎవరికీ తెలియదు కానీ,సోషల్ మీడియా లో మాత్రం రకరకాల వార్తలు ప్రచారం అవుతూనే ఉన్నాయి.ఆస్తుల కోసం గత కొంతకాలం గా వీళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నాయని.
అది చిరిగి చిరిగి గాలి వానంత అయ్యి నేడు ఇలా వీళ్ళ కొట్లాట రోడ్డు మీదకి వచ్చేసిందని ఇలా పలు రకాల వార్తలు ప్రచారం అయ్యాయి.దీని పై మోహన్ బాబు కూడా చాలా సీరియస్ అయ్యాడు.అన్నదమ్ముల మధ్య గొడవలు అనేది సర్వసాధారణం, కానీ ఈ వయస్సులో గొడవలు పడడం వాళ్లకి మంచిది కాదు.నేను వాళ్ళ మధ్య సయోధ్య కుదిరించడానికే ప్రయత్నం చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.
అయితే రీసెంట్ గా ఈ గొడవపై మంచు విష్ణు స్పందించాడు.ఆయన మాట్లాడుతూ ‘మా మధ్య ఇలాంటి గొడవలు సర్వసాధారణం.ఇది వరకు ఎన్నోసార్లు అలా జరిగింది, కానీ మనోజ్ ఈసారి వీడియో తీసి సోషల్ మీడియా లో పెట్టేసాడు, అందుకే ఇంత రచ్చ అయ్యింది.ఇది చిన్న గొడవ మాత్రమే, దయచేసి ఈ విషయాన్ని పెద్దది చెయ్యకండి’ అంటూ విష్ణు మాట్లాడాడు.ఆయన మాట్లాడిన ఈ మాటలు విని నెటిజెన్స్ మండిపడుతున్నారు.
ఏదైనా ఉంటె మీరు మీరు తేల్చుకోండి, ఇలా రోడ్డు మీదకి ఎక్కి మీ కుటుంబ పరువు తీసుకోవడం ఎందుకు.ఇద్దరికీ అంత వయస్సు వచ్చింది, బుద్ధి మాత్రం రాలేదు అంటూ మండిపడుతున్నారు.మరోపక్క గౌరవం గా బ్రతుకుతున్న మోహన్ బాబు పరువు కూడా తీసేస్తున్నారు అంటూ విరుచుకుపడుతున్నారు.మంచు మనోజ్ కూడా ఇంత చేసిన తర్వాత ఏమి జరగనట్టు నిన్న ట్విట్టర్ లో ట్వీట్స్ వెయ్యడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.