Manchu Vishnu : ఇంత పెద్ద శాడిస్టా.. సంచలనం రేపుతున్న మంచు మనోజ్ లేటెస్ట్ కామెంట్స్

- Advertisement -

Manchu Vishnu : ఏ కుటుంబం లో అయినా గొడవలు ఉండడం సహజం,మన కుటుంబాలలో ఎలాంటి గొడవలు ఉంటాయో, సెలెబ్రిటీల కుటుంబాలలో కూడా అలాంటి గొడవలే ఉంటాయి.కానీ వాళ్ళు సెలెబ్రిటీలు కాబట్టి ప్రతీ విషయం హైలైట్ అవుతుంది.రీసెంట్ గా మంచు బ్రదర్స్ మధ్య జరిగిన గొడవ అందుకు ఒక ఉదాహరణ లాంటిది.మంచు మనోజ్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ విష్ణు మమల్ని కొట్టడానికి వచ్చాడు అంటూ పెట్టిన ఒక వీడియో సోషల్ మీడియా లో ఎంత దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

Manchu Vishnu
Manchu Vishnu

ఒక్క పెద్ద కుటుంబం నుండి వచ్చిన వాళ్ళు, ఇలా నలుగురిలో పరువు తీసుకుంటూ గొడవ పడడం ఏమిటి అని నెటిజెన్స్ మంచు బ్రదర్స్ పై పెదవి విరిచారు.అయితే రీసెంట్ గా మంచు మనోజ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో, విష్ణు గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

manoj

మంచి విష్ణు చిన్నప్పటి నుండి తనని ఎంత టార్చర్ పెట్టేవాడో ఈ సందర్భంగా మంచు మనోజ్ చెప్పుకొచ్చాడు.ఆయన మాట్లాడుతూ ‘మా ఇంట్లో మా అన్నయ్య విష్ణు రూట్ సెపరేట్, నాది మా అక్క లక్ష్మి ప్రసన్నది సెపెరేట్.అందువల్ల మా మధ్య ఎప్పుడు ఎదో ఒక విషయం లో గొడవలు జరుగుతూనే ఉంటాయి.చిన్నప్పటి నుండి మా అన్న నన్ను రకరకాలు గా హింసించేవాడు.నన్ను మా అక్కని బాగా ఆడుకోమని ప్రోత్సహించి, ఆయన మాత్రం బాగా చదువుకొని మంచి మార్కులు తెచుకునేవాడు, వాడిని చూసి మా నాన్న లక్ష్మి ప్రసన్న తో ఆ గాడిదని విష్ణు ని చూసి బుద్ధి తెచ్చుకోమను అని చెప్పేవాడు.

- Advertisement -
lakshmi

అంతే కాదు ప్రతీ చిన్న విషయానికి నా మీద సాడీలు చెప్పి తిట్టించేవాడు.ఒకరోజు ట్రాఫిక్ సిగ్నల్స్ లో నేను క్రిందకి దిగి స్కూల్ కి రాకుండా బయటకి వెళ్లి ఎంజాయ్ చేశాను.ఈ విషయం విష్ణు కి తెలిసింది, నేను నాన్నకి చెప్పొద్దూ అంటూ బ్రతిమిలాడాను, అప్పుడు ఆయన చెప్పను కానీ నేను ఏ పని చెప్తే ఆ పని చెయ్యాలి అన్నాడు.అలా ఆరు నెలల పాటు నా చేత పనులు చేయించుకున్నాడు.ఇలా ఉండేది వాడి శాడిజం’ అంటూ మంచు మనోజ్ ఈ సందర్భంగా తెలిపాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here