మంచు మోహన్ బాబు తనయులుగా మంచు విష్ణు మరియు మంచు మనోజ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు. మంచు విష్ణు సోషల్ మీడియా లో ఉన్న మీమెర్స్ కి ట్రోల్ మెటీరియల్ అవ్వగా, మంచు మనోజ్ మాత్రం తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కు మరియు క్రేజ్ ని సంపాదించుకున్నాడు. మంచు కుటుంబం లో ఉన్న వాళ్లందరిపై సోషల్ మీడియా లో కామెడీ ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. కానీ మనోజ్ మీద మాత్రం ఎలాంటి ట్రోల్ల్స్ కనపడవు.

ఆయన చేసే సినిమాలు, ఆయన మనస్తత్వం, సమాజం పై అతనికి ఉన్న అపారమైన ప్రేమే ఆయనని కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది. ఇక రీసెంట్ గా ఆయన భూమా మౌనిక ని రెండవ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలం నుండి డేటింగ్ లో ఉంటున్న ఈ ఇద్దరు రీసెంట్ గానే వివాహ బంధం ద్వారా ఒకటయ్యారు.

వీళ్లిద్దరు పెళ్లి చేసుకోక ముందు సోషల్ మీడియా లో మనోజ్ పై ఎన్నో కథనాలు ప్రచురితం అయ్యాయి . మనోజ్ గతం లో తాప్సి అనే హీరోయిన్ తో ఎంతో క్లోజ్ గా ఉండేవాడని, వీళ్లిద్దరు కలిసి పలు సందర్భాలలో హైదరాబాద్ ప్రైవేట్ పార్టీలలో కెమెరాలకు చిక్కారని కొన్ని రూమర్స్ ప్రచారం అయ్యాయి. తాప్సి తన మొదటి సినిమా ‘ఝుమ్మంది నాదం’ మనోజ్ తోనే చేసింది, అప్పటి నుండి మొన్న పెళ్లి జరిగే వరకు ఈ రూమర్ ప్రచారం అవుతూనే ఉంది.

అయితే మనోజ్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘నాకు గతం లో చాలా మంది సోషల్ మీడియా లో తాప్సి తో బలవంతంగా పెళ్లి చేసేసారు. ఈ రూమర్ ని చూసి నేను తాప్సి చాలా నవ్వుకున్నాము. మేమిద్దరం కేవలం స్నేహితులం మాత్రమే, ఒక ఫ్యామిలీ ఫ్రండ్స్ లాగ కలిసిమెలిసి ఉంటాము, ఒక అమ్మాయి అబ్బాయి అలా కలిసి ఉంటే ప్రేమ , పెళ్లి తప్ప మరో ఆలోచన రాదా’ అని మనోజ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.