తండ్రి కాబోతున్న మంచు మనోజ్ ?

- Advertisement -

తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది. మోహన్ బాబు ముగ్గురు సంతానం కూడా ఇండస్ట్రీలో కాస్తంత గుర్తింపు సంపాదించుకున్నారు. వారు సినిమాల ద్వారా సంపాదించుకున్న పాపులారిటీ కంటే ట్రోలింగ్ ద్వారా ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంటున్నారు.. వీరిలో మంచు మనోజ్ వాటికి కొంచెం దూరం. కాగా మంచు మనోజ్ సినిమాల కోసం ఎంతటి రిస్క్ తీసుకోవడానికైనా సిద్ధంగా ఉంటాడు. కానీ దురదృష్టవశాత్తు కెరీర్ కు బ్రేక్ ఇచ్చే హిట్ ఇంతవరకు పడలేదనే చెప్పాలి. దానికోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇది ఇలా ఉంటే మంచు మనోజ్ ఈ ఏడాది మార్చి 3 న భూమా శోభారెడ్డి కుతూరు భూమా మౌనికను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

మంచు మనోజ్
మంచు మనోజ్

ప్రస్తుతం భూమా మౌనిక గర్భిణి అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో భూమా మౌనికకు తన మొదటి భర్తతో ఒక బాబు ఉన్న సంగతి తెలిసిందే. అయితే మనోజ్ ను పెళ్లి చేసుకున్నాక ఆ బాబు తనవద్దే పెరుగుతున్నాడు. అయినప్పటికీ కూడా మౌనికతో కూడా మనోజ్ మరో బిడ్డను ప్లాన్ చేసుకున్నాడని సందేహాలు వినిపిస్తున్నాయి. మనోజ్ కు తన మొదటి భార్య ద్వారా సంతానం లేరు. పెళ్లి తర్వాత 2019లో తనతో మనోజ్ విడాకులు తీసుకున్నారు. రెండవ భార్య అయినా మౌనిక తాజాగా ప్రెగ్నెంట్ అనే వార్తలు టాలీవుడ్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కాగా వీరిద్దరు ప్రేమించుకుని మరీ పెళ్లి చేసుకున్నారు.

Manoj-Mounika-photos

వాస్తవానికి మంచు – భూమా కుటుంబాలకు చాలా మంచి సాన్నిహిత్యం ఉంది. మంచు మనోజ్ మౌనికల పెళ్లి మోహన్ బాబుకు అసలు ఇష్టం లేదని వారి పెళ్లి సమయంలో ప్రచారం జరిగింది. అందుకే మోహన్ బాబు వారి పెళ్లి టైంలో దూరంగా ఉన్నారని వార్తలు వినిపించాయి. అందుకే కేవలం తన అక్క మంచు లక్ష్మి దగ్గరుండి వారి పెళ్లి జరిపించిందట. అందుకే పెళ్లి టైంకి కొన్ని గంటల ముందు మోహన్ బాబు హాజరై తన కుమారుడిని, భూమ మౌనికను ఆశీర్వదించారని టాక్. ప్రస్తుతం మనోజ్ ‘వాట్ ది షిప్ టైటిల్’తో ఒక సినిమాని ప్రకటించడం జరిగింది. మరి మనోజ్- మౌనిక పేరెంట్స్ అవబోతున్నారన్న వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here