నటి సుమలత ఫ్యామిలీ మోహన్‌బాబు ఫ్యామిలీ ఫ్రెండ్స్. సినీ రంగంతో పాటు రాజకీయల్లో కొనసాగుతున్నారు. ఈ డీప్ రిలేషన్‌షిప్ కారణంగానే సుమలత కొడుకు పెళ్లిలో మోహన్‌బాబు భార్య చిన్నకొడుకు మనోజ్, మౌనికతో కలిసి వచ్చారు. ఈవేడుకలో మంచు లక్ష్మీ, విష్ణు కనిపించపోవడం విశేషం. దివంగత కన్నడ నటుడు అంబరీష్, నటి, మాండ్యా ఎంపీ సుమలత కుమారుడు అభిషేక్ అంబరీష్ వివాహం అవివా బిడప్పతో చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లి వేడుకల్లో రాజకీయ ప్రముఖులతో పాటు సినీ సెలబ్రిటీలు తళుక్కున మెరిశారు.

అభిషేక్ అంబరీస్, అవివా బిడ్డప్పల పెళ్లి వేడుకలో పాల్గొన్న మనోజ్.. అక్కడ తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. భార్య మౌనికతో కలిసి పెళ్లి వేడుకలో ఆనందంగా గడిపిన క్షణాలను ఫొటోల రూపంలో అందించారు. ఈ సందర్భంగా నూతన దంపతులకు మనోజ్ అభినందనలు తెలిపారు. వీరి వైవాహిక జీవితం ప్రేమ, సంతోషం, అంతులేని ఆనందంతో నిండిపోవాలని కోరుకున్నారు.

‘జీవితకాలం మధురమైన క్షణాలు, ప్రేమతో నిండిపోవాలని, రోజురోజుకి మీ బంధం మరింత దృఢంగా అవ్వాలని కోరుకుంటున్నాను’ అని మనోజ్ పేర్కొన్నారు. అంబరీష్, సుమలత దంపతులకు మంచు వారి కుటుంబం చాలా సన్నిహితంగా ఉంటుంది. మోహన్ బాబు, అంబరీష్, రజినీకాంత్ మంచి స్నేహితులు. అంబరీష్ కన్నుమూసినప్పుడు మోహన్ బాబు కంటతడి పెట్టుకున్నారు. అంబరీష్ భౌతికకాయాన్ని చూసి బోరున విలపించారు.