పబ్లిక్ గా బాయ్ ఫ్రెండ్ లతో రొమాన్స్ చేస్తున్న తమన్నా, మృణాల్‌ .. ట్రైలరంతా పచ్చి బూతులేగా

- Advertisement -

2018లో వచ్చిన లస్ట్ స్టోరీస్ సినిమా సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. ఆంథాలజీ సినిమాగా రూపొందిన ఈ మూవీలో నాలుగు కథలుంటాయి. నాలుగు ఒకదానికొకటి సంబంధలేకుండా ప్రేమ, వ్యామోహం, శృంగారం లాంటి పలు విషయాల సమ్మేళంగా రూపొందింది. అంతకు ముందు పలు ఆంథాలజీ సినిమాలు వచ్చిన లస్ట్ స్టోరీస్ స‌ృష్టించిన సంచలనం మాములుది కాదు. పచ్చి బూతులు, బోల్డ్ సన్నివేశాలతో బాలీవుడ్లో కొత్త ట్రెండ్ కు నాంది పలికింది. అప్పటివరకు బోల్డ్ అంటే కాసిన్ని హద్దులు కనిపించేవి. కానీ ఈ సినిమాతో హద్దులు చెరిగిపోయాయి. కియారా అద్వానీ, విక్కీ కౌశల్, భూమి ఫడ్నేకర్, మనీషా కొయిరాల, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అప్పట్లో నెట్ ఫ్లి్క్స్ లో రికార్డు స్థాయి వ్యూస్ ను రాబట్టింది.

తమన్నా
తమన్నా

ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కింది. లస్ట్ స్టోరీస్-2 పేరుతో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ ఆంథాలజీ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ‘ఓ చిన్న కారు కొనే ముందు టెస్ట్ డ్రైవ్ చేస్తారు కదా! మరి, పెళ్ళికి ముందు టెస్ట్ డ్రైవ్ చేయరా?’ – ‘లస్ట్ స్టోరీస్ 2’ టీజర్ ప్రారంభంలో ఓ బామ్మ చెప్పే డైలాగ్! ఇదొక్కటీ చాలు… సిరీస్ ఎలా ఉంటుందో చెప్పడానికి! శృంగార సన్నివేశాలు ఉంటాయని ఒక్క మాటతో స్పష్టం చేశారు. పెళ్ళికి ముందు శృంగారం తప్పు కాదన్నట్టు సమర్ధించారు.

‘లస్ట్ స్టోరీస్ 2’ మీద సౌత్ ఇండియన్ ఆడియన్స్ చూపు పడుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన హీరోయిన్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇందులో ఓ ప్రధాన పాత్ర పోషించారు. ఆమె బాయ్ ఫ్రెండ్, నాని ‘ఎంసీఏ’ (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమాలో విలన్ రోల్ చేసిన విజయ్ వర్మ కూడా ఉన్నారు. ఈ సిరీస్ షూటింగ్ చేసేటప్పుడు వీళ్ళిద్దరూ ప్రేమలో పడినట్లు బాలీవుడ్ ఖబర్. టీజర్ చూస్తే… ఇద్దరు బెడ్ మీద ముద్దు పెట్టుకున్న సీన్ ఉంది. ‘లస్ట్ స్టోరీస్ 2’లో దక్షిణాది ప్రేక్షకులను ఆకర్షించే మరో కథానాయిక మృణాల్ ఠాకూర్. ‘సీతా రామం‘ సినిమాతో తెలుగు, మలయాళ ప్రేక్షకులల్లో ఆమెకు మంచి ఇమేజ్ వచ్చింది. తమన్నాతో పాటు మృణాల్ సైతం శృంగార సన్నివేశాలు చేశారట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here