Manchu Lakshmi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీ గా పేరు సంపాదించుకున్న మంచు ఫ్యామిలీ తరచూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో మరీ ముఖ్యంగా మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి పలు రకాల వార్తలు తెరపైకి వస్తున్నాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి ఆ విషయాలకు క్లారిటీ ఇచ్చేసింది.
ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ మంచు మనోజ్ – మౌనికల పెళ్లికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టింది. మనోజ్- మౌనిక చాలా నిజంగా ప్రేమించుకున్నారు. వీళ్ళ పెళ్లి జరిగితే బాగుండు అని ఎన్నోసార్లు అనుకున్నాను. అందుకు చాలా ప్రయత్నాలే చేశాను. అయినా సరే ఎందుకో అది కుదరలేదు . ఇద్దరు బడా ఫ్యామిలీ కావడం పైగా ఇద్దరు రెండో పెళ్లి కావడం తో ఎక్కువ ఆలోచించారు. అయితే వాళ్ళిద్దరూ అలా బాధపడుతూ ఉండటం చూడలేక యాదాద్రి గుడికి వెళ్లి మొక్కుకున్నాను. నేను ఇలా మొక్కుకున్నానో లేదో ఇలా పెళ్లయిపోయింది. అందుకే పెళ్లి తర్వాత జంటను అక్కడికి తీసుకెళ్లి దండం పెట్టించుకుని తీసుకు వచ్చాను. పెళ్లికి ముందు కొన్ని రోజులు ఇద్దరు నా ఇంట్లోనే ఉండేవాళ్లని తెలిపింది.
మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి మార్చి నెలలో మంచు లక్ష్మి నివాసంలో పెళ్లి చేసుకున్నారు. నిజానికి వీరి వివాహం మోహన్ బాబు, మంచు విష్ణులకు ఇష్టం లేదని అప్పట్లో ప్రచారం జరిగింది. తాజాగా మంచు లక్ష్మి చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారం నిజమేనని తేలిపోయింది.
పెళ్లికి ముందు మనోజ్, మౌనిక తనతో ఉండేవారని, అయితే ఇప్పుడు వేరే ఇంటికి మారారని మంచు లక్ష్మి పేర్కొంది. అంతేకాదు పెళ్లి తర్వాత మౌనికకు టార్చర్ మొదలైందని మంచు లక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేసింది. పెళ్లి అయ్యాక కొత్త ఇంట్లో కర్పూరం పెట్టాక మౌనిక పిలిచి ఏం చేయాలి? దీన్ని ఎలా చేయాలి? అని అడుగుతోంది. నేనేం చెప్పకుండా హింసిస్తాను. నేను అక్కడ ఉన్నప్పుడు నన్ను అడిగావా? అని నేను ఆమెను ఆటపట్టిస్తున్నాను.. అని మంచు లక్ష్మి చెప్పింది. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు కాస్త వైరల్గా మారాయి.