టాలీవుడ్ యాక్టర్ నరేశ్, పవిత్రాలోకేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ మళ్లీ పెళ్లి. తెలుగు-కన్నడ బైలింగ్యువల్‌గా వస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియో, టీజర్, సాంగ్స్, ట్రైలర్ నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తూ.. సినిమాపై సూపర్ బజ్‌ను క్రియేట్ చేస్తున్నాయి. కాగా మళ్లీ పెళ్లి మే 26న (రేపు)న థియేటర్లలో విడుదలవుతున్న నేపథ్యంలో.. నరేశ్ మాజీ భార్య (మూడో భార్య) రమ్య రఘుపతి సినిమా రిలీజ్‌పై స్టే విధించాలని కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది.

నరేశ్, పవిత్రా లోకేశ్ ప్రేమ వ్యవహారం, పెళ్లి టాపిక్తోపాటు నరేశ్‌కు అతని మూడో భార్య రమ్య రఘుపతికి మధ్య జరిగే కాంట్రవర్సీల నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ ద్వారా చెప్పేశాడు డైరెక్టర్. గత కొంతకాలంగా నరేశ్ రియల్‌లైఫ్‌లో జరిగిన, జరుగుతున్న వ్యవహారాలను ఈ చిత్రంలో ఉన్నది ఉన్నట్టుగా చూపించబోతున్నట్టు ట్రైలర్‌తో క్లారిటీ ఇచ్చేశాడు. ఈ చిత్రాన్ని హోంబ్యానర్ విజయ కృష్ణ మూవీస్‌పై నరేశ్ తెరకెక్కిస్తున్నారు.

సినిమాలోని కొన్ని సన్నివేశాలు తనను చెడుగా చూపించారని, అవి తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉండటంతో విడుదలను నిలిపేయాలని పిటిషన్ దాఖలు చేసింది. సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. తాజాగా పిటిషన్ దాఖలు చేయడం కొత్త ట్విస్ట్ నెలకొంది. మరి మళ్లీ పెళ్లి అనుకున్న ప్లాన్ ప్రకారం విడుదలవుతుందా..? లేదా..? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.