Kalki 2898 AD : ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తున్న సినిమా కల్కి.. ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.. ఒకవైపు సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో జోరు పెంచారు. నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్ పై జనాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ట్రైలర్ విడుదలకు ముందు ‘కల్కి 2898 AD’లో మాళవికా నాయర్ ఉందనే విషయం కూడా చాలామందికి తెలియదు. మేకర్స్ కూడా తన గురించి ఎక్కడా రివీల్ చేయలేదు. ప్రమోషన్స్‌లో కూడా తను పాల్గొనలేదు. దీనితో ట్రైలర్‌లో మాళవికాను చూసిన తర్వాత ఆమె పాత్ర పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.. మాళవికా నాయర్ గెటప్ చూస్తుంటే తను మహాభారతంలోని ఉత్తర పాత్రను ప్రేక్షకులు గెస్ చేస్తున్నారు. ఉత్తర అంటే అభిమాన్యుడి భార్య.. ఆమె కనిపించిన సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి..
అలా ఉత్తర కడుపులో పెరుగుతున్న అభిమన్యుడి కుమారుడిని చంపగలిగితే పాండవుల వంశం ముగిసిపోతుందని అశ్వద్ధామ అనుకుంటాడు. ఆ తర్వాత కృష్ణుడు రంగంలోకి దిగి ఉత్తర కడుపులోని బిడ్డను కాపాడుతాడు.. జీవితాంతం అశ్వద్ధామ గాయాలతోనే ఉండాలని శపిస్తాడు.. అందుకే అతను ఇప్పటికి గాయాలతో ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి.. ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఈ సినిమా జూన్ 27 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..