Akhil Akkineni: అఖిల్ ఆదిమానవుడిలా కనిపించడానికి కారణం అదా.. అయ్యగారు ఈ సారైనా ?

- Advertisement -

Akhil Akkineni: అక్కినేని అఖిల్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వీవీ వినాయక్ దర్శకత్వంలో అఖిల్ సినిమాతో అక్కినేని నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు. దీని కంటే ముందు అక్కినేని కుటుంబం అంతా నటించిన మనం సినిమాలో క్లైమాక్స్ లో కనిపించి అలరించాడు. అక్కడితో అఖిల్ హీరోగా సినిమా వస్తుందని వార్త కన్ఫాం కాగానే చాలామందికి అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అఖిల్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఆ అఖిల్ చేసిన అన్ని సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మాత్రమే యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అఖిల్ నటించిన చివరి చిత్రం ఏజెంట్. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఊహించని రేంజ్ డిజాస్టర్ అయింది. చాలామంది ఈ సినిమాను అసలు చూడలేకపోయారు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు కూడా ఇంతవరకు నోచుకోలేదు. సురేందర్ రెడ్డి ఈ సినిమాను చాలా గ్రాండ్ గా తెరకెక్కించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఒక వండర్ గా మిగిలిపోద్దని అంతా భావించారు.

కానీ అట్టర్ ఫ్లాప్ కావడంతో కొంతకాలం అఖిల్ అజ్నాతంలోకి వెళ్లిపోయాడు. ఈ సినిమా తర్వాత నుంచి ఇప్పటివరకు అఖిల్ నుంచి కొత్త సినిమా పై అఫీషియల్ గా క్లారిటీ కూడా రాలేదు. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న కథనాల ప్రకారం అఖిల్ ఇప్పుడు అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమాను చేయబోతున్నట్లు తెలుస్తోంది. యు వి క్రియేషన్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమాతోనే అనిల్ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. యువీ క్రియేషన్స్ తో అనిల్ కుమార్ కి మంచి అనుబంధం ఉంది. ఇటీవల విశ్వంభరా సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ వీడియోను కూడా ఆయనే డిజైన్ చేశారు. ఇకపోతే రీసెంట్ గా ఎయిర్ పోర్టు లాంజ్ లో లాంగ్ హెయిర్ తో దర్శనం ఇచ్చాడు అఖిల్. అయితే ఇప్పుడు అఖిల్ చేయబోయే తదుపరి సినిమా గురించి ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి.

- Advertisement -

అఖిల్ తదుపరి సినిమాలో 11వ దశాబ్దానికి చెందిన గిరిజన యువకుడి పాత్రలో కనిపించబోతున్నాడట. ఇది ఒక పిరియాడికల్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కి్స్తున్నారట. అలానే వస్తున్న కథనాల ప్రకారం ఈ సినిమాకి ఎటువంటి సోషియో ఫాంటసీ టచ్ లేదు. ఎలాగైన భారీ హిట్ కొట్టాలని ఈ సినిమా గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటుందట చిత్ర యూనిట్. అఖిల్ కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా ఇది. కాబట్టి ప్రీ ప్రొడక్షన్లోనే చాలా వరకు పనులు పూర్తయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా టీం లొకేషన్స్ వెతికే పనిలో ఉంది. ఎక్కువ శాతం సినిమా షూటింగ్ అడవుల్లోనే తీయబోతున్నట్లు తెలుస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here