Malavika Sreenath : మధురం సినిమాతో కుర్రకారు మది దోచేసింది హీరోయిన్ మాళవికా శ్రీనాధ్. ఆమె తాజాగా తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలపై చర్చ మొదలైంది. సూపర్ హిట్ చిత్రం మంజు వారియర్స్ లో నటించడం కోసం ఆడిషన్స్ కు వెళ్లినప్పుడు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. ఆ సినిమాలో కూతురిప కూతురి పాత్రకు ఎంపికయ్యానని ఫొన్ చేసి మరోసారి ఆడిషన్స్ కు రమ్మన్నారని తెలిపింది.

నాకు సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధాలు లేవు. అందుకే ఆడిషన్స్‌కు వెళ్లటానికి నిశ్చయించుకున్నాను. సినిమా వాళ్లు మా ఇంటికి కారు పంపారు. ఓ బిల్డింగ్‌లో ఆడిషన్స్ జరుగుతూ ఉన్నాయి. నేను మా అమ్మ, మా సోదరి అడిషన్స్ జరుగుతున్న చోటుకు వెళ్లాము. ఆడిషన్స్ సందర్భంగా ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. ‘జుట్టు సరిగా లేదు. మేకప్ రూమ్ లోపలికి వెళ్లి సరి చేసుకోండి’ అన్నాడు. నేను లోపలికి వెళ్లాను. అతడు నా వెంట లోపలికి వచ్చాడు.

నన్ను అసభ్యంగా తడమటం మొదలుపెట్టాడు. ‘ఓ పది నిమిషాలు కోఆపరేట్ చేస్తే ఆ పాత్ర నీదే’ అని అన్నాడు. గది బయట మా అమ్మ, అక్క ఉన్నారన్న భయం కూడా లేకుండా అలా చేశాడు. నేను భయంతో ఏడుస్తూ అక్కడినుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించాను. బయటకు వచ్చేశాను’’ అని అంది. ఈ విషయం ఇప్పుడు తలచుకున్నా చాలా భయంగా ఉంటుందని మాళవిక తెలిపింది. ఆ రోజు దేవుడి దయ వల్ల బయటపడ్డానని చెప్పింది. ఆమె తెలిపిన ఈ సంఘటనతో ఇండస్ట్రీ అంతా తీవ్ర చర్చ మెదలైంది.