మొన్న డైరెక్టర్ ను గోకింది.. ఇప్పుడేమో యాంకర్ ను.. ఎవ్వరిని వదలవా తల్లీ.. దారుణమైన ట్రోల్స్..

- Advertisement -

ఇండస్ట్రీలో అందరితో చనువుగా ఉండటం చాలా మంచిది.. అది కూడా కొంతవరకు మాత్రమే.. అందులోను హీరోయిన్లు అయితే సినిమా వరకు ఉంటే మంచిది.. అలాకాకుండా అందరిని గోకుతూ ఉంటే వాళ్ళను ఇండస్ట్రీలో రకరకాల పేర్లతో పిలుస్తారు.. తాజాగా ఓ హీరోయిన్ గురించి జనాలు అలానే అంటున్నారు.. ఆమె ఎవరో కాదు హీరోయిన్ మాళవిక నాయర్.. మొన్నీమధ్య జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ ను ఉంచుకుంటాను అంది.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ యాంకర్ ప్రదీప్ కు ప్రపోజ్ చేసింది.. అది కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..

malavika-nair

వరుస షోలతో బిజీగా ఉన్న ప్రదీప్ దాదాపు నాలుగు పదుల్లోకి అడుగుపెడుతున్నా, ఇంకా పెళ్లి ప్రస్తావనే లేదు. ఎప్పుడు చేసుకుంటాడో క్లారిటీ లేదు. లవ్‌ ఎఫైర్ల వార్తలే లేవు. అడపాదడపా ఇలాంటి వార్తలు వినిపించినా, ఏవి ఎక్కువ రోజులు నిలవలేదు. ఆల్మోస్ట్ ప్రదీప్‌ సింగిల్‌గానే ఉంటున్నాడని టాక్‌.. కాగా, ఈయనకు ఓ హీరోయిన్ ప్రదీప్ కు ప్రపోజ్ చెయ్యడం ఇప్పుడు చర్చనీయాంసంగా మారింది..

ప్రదీప్‌ హోస్ట్ గా ఆహాలో రన్‌ అవుతున్న షో సర్కార్‌. ప్రస్తుతం మూడో సీజన్‌ నడుస్తుంది. దీనికి అన్ని మంచి శకునములే టీమ్‌ మెంబర్స్ దర్శకురాలు నందినిరెడ్డి, హీరో సంతోష్‌ శోభన్‌, హీరోయిన్‌ మాళవిక నాయర్‌ హాజరయ్యారు. సినిమాని ప్రమోట్‌ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వీరితో తన గేమ్‌ ఆడించాడు ప్రదీప్‌..

- Advertisement -

మాళవిక నాయర్‌పై ప్రత్యేక ఇంట్రెస్ట్ చూపిస్తూ వచ్చాడు. ఆమె మాట్లాడకపోతే డైరెక్టర్‌ని షాట్‌ చెప్పమని అడగ్గా, నువ్వే మాట్లాడటం లేదని ఆమె చెప్పడంతో సిగ్గులతో ముగ్గేశాడు ప్రదీప్‌. ఆడియెన్స్ ని మీరు మిగిలిన వాళ్లతో మాట్లాడుతూ ఉండండి అని తాను మాళవికని చూసుకుంటానని ఆయన ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం, నందిని రెడ్డి.. ప్రదీప్‌ నువ్వు హీరో కూడా` అని చెప్పడంతో మరింత సిగ్గులొలికించాడు ప్రదీప్‌.

ఇది హైలైట్‌గా నిలిచింది.. ప్రదీప్ ను అలా చూసి మాళవిక ఇక ఆగలేకపోయింది. దొరికిన క్యాలీ ఫ్లవర్‌ తీసుకుని ప్రదీప్‌కి ప్రపోజ్‌ చేసింది. దీంతో ప్రదీప్‌ మొదట ఆనందంలో ఉబ్బితబ్బిబ్బయ్యాడు..ఆమె ఇచ్చిన క్యాలీ ఫ్లవర్‌ తీసుకుని ఎమోషనల్‌ అయ్యాడు. ఇకపై తాను క్యాలీ ఫ్లవర్‌ని కూడా ఫ్లవర్‌ జాబితాలో చేర్చుతానని చెప్పడంలో నవ్వులు పూయించింది. మాళవిక ఇచ్చిన అందమైన ఎక్స్ ప్రెషన్స్, దానికి ప్రదీప్‌ రియాక్షన్‌ మరో హైలైట్‌గా నిలిచింది.. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com