Malavika Mohanan: అడ్డమైన ప్రశ్నలేసిన నెటిజన్స్.. దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చిన మాళవిక మోహనన్

- Advertisement -

Malavika Mohanan: మాళవిక మోహనన్ ఇటీవల కాలంలో ఎక్కువగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న పేరు. త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తంగలాన్, రాజా సాబ్ సినిమాలతో రానుంది. ఆ సినిమాల్లో ఆల్రెడీ తంగలాన్ షూటింగ్ పూర్తయింది. కానీ విడుదల విషయంలో క్లారిటీ రావడం లేదు. రాజా సాబ్ షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో ఎవ్వరికీ తెలియదు. అలా మాళవిక టాలీవుడ్ ఎంట్రీ లేట్ అవుతూనే వస్తోంది. తెలుగు తెరకు మాళవిక పరిచయం కాకపోయినా.. ఆమె అందాలు మాత్రం ఇన్ స్టాగ్రాం ద్వారా తెలుగు ఆడియెన్స్‌కు బాగానే పరిచయం అయ్యాయి. ఆమె అందాల ప్రదర్శన ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే మారుతుంటుంది.

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మోహనన్ కుమార్తె మాళవిక మోహనన్ ఆయన వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. సోమవారం (ఏప్రిల్ 29), ఆమె తన ఫాలోవర్స్ తో X.comలో తన ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసింది. ట్విట్టర్‌లో మాళవిక పెట్టిన క్యూ అండ్ ఏ సెషన్ అదిరిపోయింది. ఇక ఒక్కో నెటిజన్ ఒక్కోలా ప్రశ్నలు సంధించాడు. కొందరు పాజిటివ్ ప్రశ్నలు వేస్తే.. ఇంకొందరు ట్రోలింగ్ చేసే విధంగా ప్రశ్నలు వేశారు. నెగెటివ్ ప్రశ్నలకు సైతం మాళవిక రిప్లై ఇవ్వడమే ఇక్కడ విశేషం. అయితే మాళవిక తంగలాన్, గిల్లి మూవీస్ మీద స్పందించింది. అందులో పెళ్లి ఎప్పుడని ఓ నెటిజన్ అడగ్గా, “నేను పెళ్లి చేసుకోవాలని ఎందుకు తొందరపడుతున్నావు?” అంటూ అతడికే ఎదురు ప్రశ్న వేసింది.

- Advertisement -

malavika mohanan

మొదటి క్రష్ గురించి అడిగితే ఆమె బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అని వెల్లడించింది. బొడ్డుకు రింగ్స్ లాంటివి పెట్టించుకోవడం గురించి ప్రస్తావిస్తే ఈ చాట్ కింకీ సెషన్ కాదంటూ ఘాటు ఆన్సర్ ఇచ్చింది. మరో నెటిజన్ ఓ అడుగు ముందుకేసి ‘ఇక ఆమె స్కిన్‌షోలు చేయడం మానేసి, మరింత సీరియస్‌గా నటించడం ఎప్పుడు ప్రారంభిస్తారు’ అని అడిగినప్పుడు, ఆమె కాస్త ఘాటుగానే స్పందించింది. ‘గ్లామర్ షో ఎప్పటికీ ఆపను’ అని స్పందించింది. గ్లామర్ ఫోటోషూట్‌లు చేయడం కూడా తనకు చాలా ఇష్టం అని చెప్పింది. ఆమె “నాకు ఇష్టం. సింపుల్… దానితో సమస్య ఉందా?” అని ప్రశ్నించింది. ఆమె ప్రభాస్ చిత్రంలో నటించడానికి హైదరాబాద్‌కు రెగ్యులర్ ట్రావెల్స్ చేస్తూ ఉంది కాబట్టి హైదరాబాద్ ఫుడ్ గురించి అడిగితే ఈ ఆహారం చాలా స్పైసీగా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here