Sitara టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ దంపతుల ముద్దుల కూతురు సితారకు తాజాగా అరుదైన గౌరవం లభించిన సంగతి తెలిసిందే. ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ పీఎంజే జ్యువెలరీకి సితార బ్రాండ్ అంబాసిడర్ అయింది. సితార కొన్ని రోజుల క్రితం ఆ బ్రండ్ ఆభరణాలను ప్రమోట్ చేసే విధంగా ఆ సంస్థ ప్రకటనలో నటించింది. అందుకు సంబంధిత ఫోటోలు న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్‌లో ప్రదర్శించారు.

చిన్న వయసులో ఇలాంటి అరుదైన ఘనత సాధించడం పట్ట మహేశ్ ఫ్యాన్స్ ఎంతో ఉత్సుకతతో ఉన్నారు. మహేష్ బాబు కూతురు సితారను ప్రశంసల వర్షంలో ముంచారు. అలాగే ఈ బ్రాండ్ ప్రమోషనల్ యాడ్ కోసం సితార కోటి రూపాయల వరకు రెమ్యునరేషన్ అందుకుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అతి చిన్న వయసులో ఇంత భారీ మొత్తం అందుకోవడం ఇదొక రికార్డు. అయితే ఇప్పుడు సితారకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇంతకీ మేటరేంటంటే.. సితార నెక్స్ట్ టార్గెట్ మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ పోటీలేనట. అందాల పోటీల్లో సితార తల్లి నమ్రతకు మంచి పట్టుంది. తాను 1993లో మిస్ ఇండియాగా కూడా ఎంపికైంది.. ఇప్పుడు అమ్మ సూచనలతోనే సితార ఈ పోటీలకు సిద్ధమవుతోందని ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకు అన్ని అర్హతలు సాధించేలా సితార అడుగులు వేస్తోంది. ఇదే నిజమైతే సితార హీరోయిన్ గా సినిమా రంగంలోకి రావడం ఖాయమంటున్నారు విశ్లేషకులు.