Sitara Ghattamaneni : సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కుమార్తె సితార.. ఇటీవల ఓ జ్యువెలరీ సంస్థకు ప్రకటనకర్తగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఆ సంస్థ స్పెషల్ ఈవెంట్‌లో నమ్రత, సితార పాల్గొన్నారు. ఇందులో భాగంగా సితార మాట్లాడుతూ.. తనకు సినిమాల్లోకి రావాలని ఆసక్తిగా ఉందన్నారు. నటన అంటే తనకెంతో ఇష్టమన్నారు.

‘‘జ్యువెలరీ సంస్థ యాడ్‌లో వర్క్ చేయడం సంతోషంగా ఉంది. షూట్ కూడా సరదాగా సాగింది. ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేశారు. ఇక, ఈ యాడ్‌కు సంబంధించిన నా ఫొటోలను న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్‌లో ప్రదర్శించిన రోజు.. ఆనందంతో కన్నీళ్లు వచ్చేశాయి. నాన్నను హత్తుకుని భావోద్వేగానికి గురయ్యా. నాకు సినిమాల్లోకి రావాలనే ఆసక్తి ఉంది. నా ఫస్ట్ రెమ్యునరేషన్‌ను సేవా కార్యక్రమాలకు ఇచ్చాను’’ అని ఆమె చెప్పారు. దీంతో హీరోయిన్ కావడం కోసమేగా ఇంత చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అనంతరం నమ్రత మాట్లాడుతూ.. ‘‘సరైన గైడెన్స్, మంచి మనుషుల సపోర్ట్ ఉంటే సినీ పరిశ్రమ ఎంతో అందమైన ప్రదేశం. కాకపోతే, చాలామందికి ఈ పరిశ్రమపై సదాభిప్రాయం లేదు. మా పిల్లలను మేము ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటాం. నచ్చిన పనినే చేయమని చెబుతుంటాం. ఇష్టమైన పని చేసినప్పుడే వాళ్లు ఆనందంగా ఉంటారు. సితార సినిమాల్లోకి వస్తానంటే మేము అంగీకరిస్తాం. గౌతమ్‌కు ఇప్పుడు 16 ఏళ్లు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలని ఆసక్తిగా ఉన్నాడు. అతడు సినిమాల్లోకి రావడానికి సుమారు ఎనిమిదేళ్లు పట్టొచ్చు. సితార యాక్ట్ చేసిన ఈ జ్యువెలరీ యాడ్‌ను మహేశ్ చాలా ఇష్టపడ్డారు. రిపీట్ మోడ్‌లో ఎన్నోసార్లు చూశారు. ఇది మాకొక ఎమోషనల్ మూమెంట్’’ అని తెలిపారు.