Mahesh టాలీవుడ్ లవ్లీ కపుల్ ఎవరనగానే టక్కున గుర్తుకు వచ్చే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ దంపతులు. వంశీ సినిమా షూటింగులో ఏర్పడిన పరిచయం ప్రేమగా చిగురించింది. ఈ సినిమా అయిపోయే సమయానికి వీరిద్దరి మధ్య బాండింగ్ స్ట్రాంగ్ అయింది. దీంతో వీరి ప్రేమాయణం ఏడేళ్ల పాటు సాగింది. అనంతరం కుటుంబ సభ్యులను ఒప్పించి మహేష్ బాబు, నమ్రత ఫిబ్రవరి 10, 2005న ముంబైలో చాలా కొద్ది మంది సమక్షంలో సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. నమ్రత తన జీవితంలోకి వచ్చిన తర్వాత మహేశ్ కెరీర్ పరిగెత్తింది. స్టార్ హీరో అయిపోయారు.

పెళ్లయిన తర్వాత ఆఫర్లు చాలా వచ్చి నమ్రత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. కుటుంబ బాధ్యతలను పూర్తిగా తీసుకుంది. వారి ప్రేమకు నిదర్శనంగా మహేష్, నమ్రత దంపతులకు గౌతమ్, సితార జన్మించారు. పెళ్లయి దాదాపు 20సంవత్సరాలు కావొస్తున్నా వారు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ వచ్చారు. అలాగే ఒకరిపై ఒకరికి ఎనలేని ప్రేమ. అంత ప్రేమ ఉన్నా… మహేశ్ ఓ సారి నమ్రత చేసిన పనికి కోపం వచ్చిందిట. ఆ కోపంలో నమ్రత చెంప పగుల కొట్టారట. అంతటి కోపానికి కారణం కూడా లేకపోలేదు.
గౌతమ్ కడుపులో ఉండగా నమ్రతకు అనేక ఆరోగ్య సమస్యలు వచ్చాయట. ఆమె తక్కువ బరువు కారణంగా, గర్భంలో సమస్యలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో తాను డిప్రెషన్‌లో పడిపోయి నిత్యం ఏడ్చేదట. డిప్రెషన్ తల్లికి, కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదకరమని డాక్టర్లు మహేష్ బాబుకు చెప్పారట. నమ్రతను మళ్లీ మామూలుగా చేసేందుకు మహేష్ చాలా ప్రయత్నించాడట. అయితే నమ్రత మాత్రం బాధపడుతూ ఉండేదట. ఒకరోజు మహేష్ బాబుకి చిరాకే వచ్చి చాలా కోపం తెచ్చుకున్నారట. ఈ కోపంలోనే నమ్రత చెంప మీద లాగి కొట్టాడట. ఆపై నమ్రత తన తప్పును గ్రహించిందట. అప్పటి నుంచి తాను స్థిమిత పడిందట. ఈ విషయాన్ని నమ్రత స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
